డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లగ్జరీ కార్

By Ravi

డిసి డిజైన్స్ ప్రియులకు మరొక కన్నుల పండుగ కానుక. ఇటీవలే హ్యుందాయ్ ఎలాంట్రాను మోడిఫై చేసిన డిసి డిజైన్స్ తాజాగా మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్‌ను తమదైన శైలిలో కస్టమైజ్ చేసింది. ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా గతంలో అంబాసిడర్, రెనో డస్టర్, నిస్సాన్ సన్నీ, లాంబోర్గినీ అవెంటేడర్ వంటి అనేక రకాల కార్లను డిసి డిజైన్స్ డిఎన్ఏ జోడించి కస్టమైజ్ చేయటం జరిగింది.

తాజాగా జర్మన్ లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో విడుదల చేసిన ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు ఏ-క్లాస్‌ను కూడా మోడిఫై చేశారు ఈ డిసి డిజైన్స్ వాళ్లు. ఆ మోడిఫికేషన్లకు సంబంధించిన వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించవచ్చు.

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

డిసి డిజైన్స్ ఇప్పటి వరకు కస్టమైజ్ చేసిన అనేక వాహనాలను ఫొటోల రూపంలోనే విడుదల చేసింది కానీ, వాటికి సదరు మోడిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్‌ను ఇటీవలే డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన ఎలాంట్రా మాదిరిగా కాకుండా, మోడిఫికేషన్లను కేవలం ఎక్స్టీరియర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. (ఎందుకంటే, ఇంటీరియర్ ఫొటోలు విడుదల చేయలేదు కాబట్టి).

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

ఈ ఫోటోలో చూసినట్లుగా, మెరిసే మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ పెయింట్‌ను మ్యాట్ డార్క్ కలర్ పెయింట్‌తో రీప్లేస్ చేశారు. ఈ కొత్త పెయింట్ వర్క్ వలన ఇది మరింత స్పోర్టీగా కనిపిస్తుంది.

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

అలాగే, ఎప్పుడు మెరుస్తూ కనిపించే మెర్సిడెస్ బెంజ్ 3-పాయింటెడ్ స్టార్ లోగో ఇక్కడ నల్లగా కనిపిస్తోంది. క్రోమ్ లోగో స్థానంలో బాడీ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా బ్లాక్ మ్యాట్ ఫినిష్‌తో కూడిన లోగోను ఉపయోగించారు.

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఫ్రంట్ గ్రిల్‌ను మాత్రం టచ్ చేయకుండా అలానే ఉంచారు. ఇది గ్రిల్‌పై వజ్రాలు పొదినట్లుగా అనిపిస్తుంటుంది.

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

లో ప్రొఫైల్ టైర్లు కలిగిన 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఎయిర్ స్ప్లిట్టర్, రెడ్ కలర్‌తో హైలైట్ చేయబడిన రియర్ స్క్రాచ్ గార్డ్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన మోడిఫికేషన్లు.

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

ఏ-క్లాస్ కారును విభిన్నంగా, విశిష్టంగా, స్టయిలిష్‌గా, స్పోర్టీగా, మరింత లగ్జరీగా మార్చుకోవాలనుకునే వారు డిసి డిజైన్స్‌ను ఆశ్రయించవచ్చు.

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

రెడ్ కలర్‌తో హైలైట్ చేయబడిన రియర్ స్క్రాచ్ గార్డ్ ఈ కారుకు వెనుక వైపు నుంచి మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది.

డిసి స్టయిల్ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ విషయానికి వస్తే, భారత మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ ధర రూ.21.73 లక్షలు, డీజిల్ వెర్షన్ ధర రూ.22.73 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, August 9, 2013, 9:28 [IST]
English summary
Indian auto design and tuning house, DC Design is seeing renewed activity these days. In the past few months the Dilip Chhabria run company has revealed modified Renault Duster and Hyundai Elantra. There latest work is based on a car higher up the order. A Mercedes Benz A Class.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+