డిసి అవంతి స్పోర్ట్స్ కార్ ఉత్పత్తికి రంగం సిద్ధం
వెహికల్ కస్టమైజేషన్ దిగ్గజం, ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన 'డిసి డిజైన్స్' సంస్థ గుజరాత్‌లోని సనంద్‌లో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. గడచిన సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా డిసి డిజైన్స్ ఆవిష్కరించిన మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కారు 'డిసి అవంతి' (DC Avanti) మరియు ఓ కొత్త సూపర్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేయటం కోసం ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
గుజరాత్ రాష్ట్రంలోని సనంద్ పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కోసం రూ.60 కోట్ల పెట్టబడిని వెచ్చించనున్నామని, ఇది 2014 నాటికి నిర్వహణలోకి వస్తుందని డిసి డిజైన్స్ పేర్కొంది. టాటా నానో కోసం టాటా మోటార్స్ సనంద్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్, అలాగే ఇదే ప్రాంతంలో ఫోర్డ్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌లకు సమీపంలోనే డిసి డిజైన్స్ కూడా తమ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటులో డిసి డిజైన్స్ ఏటా 3,500 కార్లను ఉత్పత్తి చేయనుంది.

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్

డిసి అవంతి సూపర్‌కార్
డిసి డిజైన్స్ సనంద్ ప్లాంటులో తొలుత అవంతి కారును ఉత్పత్తి చేయనున్నారు. అనంతరం ఓ సూపర్ ఎస్‌యూవీని కూడా ఉత్పత్తి చేయనున్నారు. దేశీయ విపణిలో డిసి అవంతి రూ.25 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. అతి తక్కువ ధరలో అత్యంత విలువైన స్పోర్ట్స్ కారు డిసి అవంతిలో ఇందులో ఫోర్డ్ నుంచి గ్రహించిన ఎకోబూస్ట్ 2.0 లీటర్ ఫోర్-సిలిండర్ డిఓహెచ్‌సి 6-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 240 బిహెచ్‌పిల శక్తిని, 366 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
డిసి అవంతి సూపర్ కారు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో ఏబిఎస్, ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఏబిఎస్ సిస్టమ్‌ను ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ బోష్ అందిస్తుంది. డిసి డిజైన్స్ లిమిటెడ్ ఎడిషన్ కార్లను తయారు చేస్తుంది, ఏదైనా వేరియంట్ 4,000 యూనిట్ల ఉత్పత్తిని దాటితే, దానిని నిలిపివేసి ఆ స్థానంలో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తామని దిలీప్ ఛాబ్రియా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








