కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

By Ravi

భారత్‌లో వెహికల్ కస్టమైజేషన్ డిసి డిజైన్స్‌‌ సంస్థను మించిన మరొక సంస్థ లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా స్థాపించిన ఈ డిసి డిజైన్స్ సంస్థ ఇటీవల ఓ రెనో డస్టర్‌ను కస్టమైజ్ చేసి, ఓ టీజర్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కస్టమైజ్ రెనో డస్టర్ అఫీషియల్ ఫొటోలోను డిసి డిజైన్స్ విడుదల చేసింది.

డిసి డిజైన్స్ రెనో డస్టర్‌ను ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో తీర్చిదిద్ది డిసి డస్టర్‌‌గా కస్టమైజ్ చేసింది. రెనో డస్టర్‌ను ఇలా డిసి డస్టర్‌గా కస్టమైజ్ చేయటం కోసం కంపెనీ భారీగానే వసూలు చేస్తుంది. ఈ కస్టమైజేషన్ రూ.3.49 లక్షల నుంచి ప్రారంభమవుతుందని డిసి డిజైన్స్ పేర్కొంది. లగ్జరీ సుఖాలను పొందాలను లక్షల రూపాయలను చెల్లించక తప్పదు మరి.

డిసి డస్టర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దా రండి..!

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

డిసి డిజైన్స్ రూపొందించిన కస్టమైజ్డ్ రెనో డస్టర్ గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ డిసి డస్టర్‌కు సంబంధించి అఫీషియల్ ఫొటోలను మరియు మరిన్ని వివరాలను విడుదల చేసింది. అవేంటో తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకుందాం రండి..!

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

రెనో డస్టర్ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసి సరికొత్త గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, ఫాగ్ ల్యాంప్స్, హెడ్‌లైట్స్ స్థానంలో శక్తివంతమైన ఎల్‌ఈడి ల్యాంప్స్‌, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ ఏర్పాటు చేసిన క్రోమ్ కోటింగ్, రీడిజైన్ చేయబడిన బానెట్ వంటి మార్పులను ఈ డిసి డస్టర్‌లో గమనించవచ్చు.

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

డిసి డస్టర్‌కు సరికొత్త పెయింట్‌ ఆప్షన్‌ను జోడించారు. అంతేకాకుండా ఈ మోడల్‌కు 10 స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. వీటి వలన ఇది మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది.

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

వైట్, ఉడ్ ఫినిషింగ్‌లో తయారు చేసిన డిసి డస్టర్ ఇంటీరియర్స్ బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ఇంటీరియర్స్‌ను తలపిస్తాయి. ఇవి ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌ని తెచ్చిపెడతాయి.

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

ఇందులో అమర్చిన మెత్తటి తెలుపు రంగు ప్రీమియం లెథర్ సీట్లు ప్రయాణికులకు ఓ మంచి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని మిగుల్చుతాయి.

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

డిసి డస్టర్ వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఫుడ్/ల్యాప్‌టాప్ ట్రే, వినోదం కోసం ఏర్పాటు చేసిన ఎల్‌సిడి స్క్రీన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

ఆటోమేటిక్ సీట్ అడ్జస్టమెంట్ వలన ప్రయాణికులు తమ సౌకర్యానికి తగినట్లుగా సీట్లను సర్దుబాటు చేసుకోవచ్చు.

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

ఈ కస్టమైజ్డ్ రెనో డస్టర్‌లో నలుగురికి మాత్రమే (డ్రైవర్‌తో కలిపి) చోటు ఉంటుంది.

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

ఈ కస్టమైజేషన్ రూ.3.45 లక్షల నుంచి ప్రారంభమవుతుందని డిసి డిజైన్స్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 24, 2013, 10:30 [IST]
English summary
DC Design has revealed the custom Renault Duster on its Facebook page. Several images, revealing the exterior and the interior are out on Facebook. Cost of customization starts at INR 3.49 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+