డిసి డిజైన్స్ నుంచి కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్

By Ravi

డిసి డిజైన్స్.. ఈ సంస్థ గురించి ఆటోమొబైల్ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెహికల్ కస్టమైజేషన్‌లో మంచి పేరున్న దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిజైన్ సంస్థ ఇది. డిజి డిజైన్స్ ఇప్పటికే అనేక రకాల కార్లు, వాహనాలను కస్టమైజ్ చేసింది. ఇందులో కొన్ని హిట్ అయ్యాయి మరికొన్ని ఫట్ అయ్యాయి.

డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన వాహనాలన్నీ కూడా వాటి ఒరిజినల్ డిజైన్ కన్నా అందంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కారు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. సాధారణంగా డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసే కార్లలో ఎక్స్టీరియర్స్ నుంచి ఇంటీరియర్స్ వరకు అనేక మార్పులు చేర్పులు ఉంటాయి.

ఈ మార్పుల వలన ఇది రెగ్యులర్ వెర్షన్ కన్నా స్టయిలిష్‌గా ప్రీమియంగా అనిపిస్తుంది. కానీ ఈ హ్యుందాయ్ ఐ20 విషయంలో మాత్రం కస్టమైజ్డ్ వెర్షన్ కన్నా రెగ్యులర్ వెర్షనే బాగుంటుందనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందో తెలియాలంటే, క్రింది ఫొటోలను పరిశీలించండి.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

డిసి డిజైన్స్ ఇదివరకటి వెర్షన్ హ్యుందాయ్ ఐ20 (ఐ-జెన్ ఐ20 మోడల్ కాదు)ను తీసుకొని, దాని ఎక్స్టీరియర్స్‌ను వైట్ అండ్ రెడ్ థీమ్‌తోను, ఇంటీరియర్స్‌ను బ్లాక్ అండ్ రెడ్ థీమ్‌తోను కస్టమైజ్ చేశారు.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

ముందు వైపు డిసి డిజైన్ స్టయిల్‌తో కూడిన కొత్త మెష్ గ్రిల్‌ను, డిసి యాంబ్లంను జోడించారు. ఈ గ్రిల్ చుట్టూ రెడ్ కలర్ సరౌండింగ్ ఉంటుంది.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

అలాగే హెడ్‌ల్యాంప్స్‌కు దిగువన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, గ్రిల్ అండ్ బంపర్ స్పాయిలర్ లిప్, సైడ్ స్కర్ట్స్‌ను రెడ్ కలర్ ప్లాస్టిక్‌తో డిజైన్ చేశారు.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

వెనుక వైపు కూడా బంపర్‌లో రెడ్ కలర్ ఇన్‌సెర్ట్, దానిపై క్రోమ్ సైలెన్సర్ పైప్స్ (పనిచేయనివి, రెగ్యులర్ సైలెన్సర్ కారు క్రింది భాగంలోనే ఉంటుంది) ప్రత్యేకంగా ఉంటాయి.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

ఇంటీరియర్స్‌లో కూడా ఇదే తరహా డ్యూయెల్ టోన్ కలర్ థీమ్ ఉంటుంది. అయితే, ఇందులో ఎక్స్టీరియర్స్ మాదిరి వైట్ రెండ్ కాకుండా, బ్లాక్ రెడ్ కాంబినేషన్‌ను ఉపయోగించారు.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

ఈ స్టాండర్డ్ ప్యాకేజ్‌లో కేవలం ఎక్స్టీరియర్ విజువల్ చేంజెస్ మాత్రమే లభిస్తాయి. ఇంటీరియర్ మోడిఫికేషన్స్ అధనంగా ఉంటాయి.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

ఇదివరకటి డిసి డిజైన్ మోడిఫైడ్ వాహనాల్లో చూసిన విధంగా ఈ డిసి ఐ20 ఇంటీరియర్స్ కూడా ఉంటాయి. ఇందులో రెడ్ లెథర్‌ను ఉపయోగించారు.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

బ్లాక్ అండ్ రెడ్ డ్యాష్‌బోర్డ్, రెడ్ సీట్ కవర్స్, రెడ్ అప్‌హోలెస్ట్రీ.. ఇలా మొత్తమ్మీద కారు ఇంటీరియర్‌లో ఎక్కువ భాగం రెడ్ కలర్ వర్క్ కనిపిస్తుంది.

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ హ్యుందాయ్ ఐ20

ఇంటీరియర్ మోడిఫికేషన్‌లో కొత్తగా ఎలాంటి అదనపు పరికరాలు కానీ లేదా ప్రస్తుతం ఉన్న వాటికి అప్‌గ్రేడ్స్ కాని లభించవు. మరి మీకు నచ్చిందా ఈ డిసి మోడిఫైడ్ ఐ20..?

More from DriveSpark

Article Published On: Monday, November 4, 2013, 16:05 [IST]
English summary
Among the various concept modified cars featured on DC Design's website is this White & Red Hyundai i10. The site provides no further information. Obviously, more information will be provided if you contact DC expressing your wish to modify your i20. But the question to be asked is why would you? The reason for that question will be evident once you browse through the image gallery of the said car. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+