డిసి డిజైన్స్ చేతిలో వంపులు తిరిగిన 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

వెహికల్ కస్టమైజేషన్‍‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ దేశీయ కంపెనీ డిసి డిజైన్స్ తాజాగా మరో పాపులర్ కారును అత్యద్భుతంగా కస్టమైజ్ చేసింది. వెహికల్ కస్టమైజేషన్‌లో మంచి పేరున్న దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ తాజాగా భారత మార్కెట్లోనే కాకుండా, గ్లోబల్ మార్కెట్లలో సైతం అత్యధికంగా అమ్ముడుపోతున్న పాపులర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తమదైన శైలిలో కస్టమైజ్ చేసింది.

డిజి డిజైన్స్ ఇప్పటికే అనేక రకాల కార్లు, వాహనాలను కస్టమైజ్ చేసింది. ఇందులో కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి వాటిల్లో ఈ కస్టమైజ్డ్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కూడా చేరిపోనుంది. డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన వాహనాలన్నీ కూడా వాటి ఒరిజినల్ డిజైన్ కన్నా అందంగా ఉంటాయి. పాపులర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను గుర్తుపట్టలేనంతగా, ఆల్ట్రా లగ్జరీ ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్ ఫీచర్లతో కస్టమైజ్ చేశారు.

మరి డిసి డిజైన్స్ చేతిలో వంపులు తిరిగిన ఈ కస్టమైజ్డ్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలోని విశేషాలేంటో తెలుసుకుందాం రండి..!

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

ముందుగా ఎక్స్టీరియర్ లుక్‌ని గమనిస్తే, ఫ్రంట్ బంపర్‌ని పూర్తిగా మార్చేశారు. పెద్ద హనీకోంబ్ గ్రిల్, దానికి దిగువన చిన్న ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త సైడ్ మిర్రర్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఫోర్డ్ లోగో స్థానంలో డిసి లోగో కనిపిస్తుంది.

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

ఈ కస్టమైజ్డ్ డిసి ఈకోస్పోర్ట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరొక హైలైట్ ఫీచర్ ఎంటంటే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్. హెడ్‌ల్యాంప్స్‌కు ఎగువ భాగంలో ఉండే ఈ ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లలోనే టర్న్ ఇండికేటర్ లైట్లు కూడా ఉండటం విశేషం.

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

రెగ్యులర్ 5-సీటర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను డిసి డిజైన్స్ కంఫర్టబల్ 4-సీటర్ (2 + 2)గా మార్చేశారు. ముందు వరుసలో రెండు కెప్టెన్ సీట్లు, వెనుక సీట్లు, వెనుక వరుసలో రెండు కెప్టెన్ సీట్లను అమర్చారు. వీటన్నింటినీ యాంత్రికంగా (ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సీట్స్) సర్దుబాటు చేసుకోవచ్చు.

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

ముందు సీట్లను వేరు చేస్తూ సెంటర్ కన్సోల్ ఉన్నట్లుగానే, వెనుక వరుసలో సీట్లలో కూడా సెంటర్ కన్సోల్ ఉంటుంది. వెనుక సీట్లను అడ్జస్ట్ చేసుకునేందుకు సెంటర్ కన్సోల్‌కే స్విచ్‌లు అమర్చబడి ఉంటాయి.

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు సైతం ఎయిర్ కండిషనింగ్ వచ్చేలా ఫ్రంట్ సెంటర్ కన్సోల్‌పై రియర్ ఏసి వెంట్‌ను అమర్చారు. ఇంటీరియర్స్‌ను ఎక్కువ భాగం బీజ్ కలర్‌తో బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో కస్టమైజ్ చేశారు.

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

వెనుక సీట్లో కూర్చునే ప్యాసింజర్ల వినోదం కోసం రెండు పెద్ద ఎల్‌సిడి స్క్రీన్లను అమర్చారు. కారు పైభాగాన్ని కూడా కస్టమైజ్ చేశారు. ఇందులో ఇంటీరియర్ లైటింగ్ (మూడ్ లైటింగ్) హైలైట్‌గా నిలుస్తుంది.

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కస్టమైజేషన్ ప్యాకేజ్ గురించి డిసి డిజైన్స్ ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మీ సమీపంలో డిసి డిజైన్ అవుట్‌లెట్‌ను సందర్శించి కానీ లేదా ఫోన్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు.

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

డిసి డిజైన్స్ కస్టమైజ్డ్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ రియర్ సెంటర్ కన్సోల్ మరియు ఎలక్ట్రానిక్ కంట్రోల్ స్విచ్‌లు.

డిసి డిజైన్స్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'

ఈ కస్టమైజ్డ్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలోని హెడ్‌రెస్ట్ లను కూడా యాంత్రికంగా కంట్రోల్ చేసుకోవచ్చని తెలుస్తోంది. ముందు సీట్లను వెనుకకు వంచుకున్నట్లుగానే వెనుక సీట్లను కొంత కోణం వరకు వెనక్కు వంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, December 23, 2013, 16:48 [IST]
English summary
DC Designs has come up with a customized Ford Ecosport, which incidentally happens to be the hottest selling SUV in the Indian car market. DC Designs has modified the exteriors and interiors of the compact SUV thoroughly. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+