మారుతి స్విఫ్ట్‌ని మోడిఫై చేసిన డిసి డిజైన్స్.. నచ్చిందా..?

By Ravi

వాహనాల కస్టమైజేషన్‌లో పేరుగాంచిన ప్రముఖ ఇండియన్ వెహికల్ కస్టమైజేషన్ కంపెనీ 'డిసి డిజైన్స్' తాజాగా మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను తమ స్టైల్‌‍లో కస్టమైజ్ చేసింది. ఈ కంపెనీ ఇప్పటికే గతంలో టొయోటా ఇన్నోవా కోసం పలు లాంజ్ ప్యాకేజ్‌లను కూడా లాంచ్ చేసింది. అలాగే హ్యుందాయ్ ఐ20, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ వంటి మోడళ్లను తమ స్టైల్‌లో కస్టమైజ్ చేసింది.

ఇదే కోవలో తాజాగా.. మారుతి స్విఫ్ట్‌ని కూడా కస్టమైజ్ చేసింది. ఫుల్లీ కస్టమైజ్డ్ ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్‌తో ఈ కారును డిజైన్ చేశారు. డిసి డిజైన్స్ ఇప్పటి వరకూ ఎన్నో రకాల పాపులర్ కార్లను, ఎంతో అందగా కస్టమైజ్ చేసింది. కానీ ఈ స్విఫ్ట్ మాత్రం బయటి వైపు నుంచి పెద్దగా ఆకట్టుకునేలా లేదు. అయితే, దీని కస్టమైజ్డ్ ఇంటీరియర్స్ మాత్రం విలాసవంతంగా డిజైన్ చేశారు.

ఈ డిసి మోడిఫైడ్ స్విఫ్ట్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

లైట్స్

లైట్స్

డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన ఈ స్విఫ్ట్ కారులో ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు. ఇందులో కస్టమైజ్డ్ హెడ్‌ల్యాంప్స్‌ను చూడొచ్చు. హెడ్‌ల్యాంప్స్‌కు దిగువనే అమర్చిన ఫాగ్‌ల్యాంప్స్, దాని క్రింది భాగంలో అమర్చిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

స్విఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా కస్టమైజ్ చేశారు. ఫ్రంట్ బంపర్‌లో పెద్ద ఎయిర్ ఇన్‌‌టేక్ డ్యామ్ హనీకోంబ్ గ్రిల్, డిసి బ్యాడ్జ్‌లను ఇందులో చూడొచ్చు. అలాగే, బంపర్‌కు గ్రిల్‌కు మధ్యలో బ్లూ కలర్ లైన్ ఆకర్షనీయంగా ఉంటుంది.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

స్విఫ్ట్ రియర్ బంపర్‌ను కూడా పూర్తిగా కస్టమైజ్ చేశారు. హనీకోంబ్ గ్రిల్, బ్లూ కలర్ ఇన్నర్ లైనింగ్‌తో కూడిన డిజైన్‌ను ఇందులో చూడొచ్చు.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

వైట్ అండ్ రెడ్ థీమ్‌తో ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు. (మన రోడ్లకి వైట్ ఇంటీరియర్స్ అంతగా సూట్ కావు).

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఫ్రంట్ డ్యాష్‌బోర్డ్, సీట్స్‌ను వైట్ కలర్‌లై డిజైన్ చేశారు. డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్‌పై అక్కడక్కడా రెడ్ ఇన్‌సెర్ట్స్ కనిపిస్తాయి.

Most Read Articles

English summary
Check out the DC Design’s new makeover for Maruti Swift.
Story first published: Saturday, February 7, 2015, 12:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X