డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా

By Super Admin

వాహనాలను అత్యంత సుందరంగా, విలాసవంతంగా తీర్చిదిద్దడంలో అత్యంత పాపులర్ అయిన ఇండియన్ వెహికల్ కస్టమైజేషన్ కంపెనీ 'డిసి డిజైన్స్' గతంలో టొయోటా ఇన్నోవా కోసం పలు లాంజ్ ప్యాకేజీలను విడుదల చేసిన సంగతి తెలిసినదే.

అయితే, ఈ కస్టమైజేషన్ హౌస్ తాజాగా మరో ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రీమియం బ్రౌన్ కలర్ ఇంటీయర్స్ థీమ్, ప్రీమియం ఉడ్ ఫినిష్, లగ్జరీ కంఫర్ట్ ఫీచర్లతో డిసి డిజైన్స్ ఈ ప్యాకేజ్‌ను అందిస్తోంది.

సాధారణంగా, ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్ ప్రారంభ ధర రూ.5.5 లక్షలు. అయితే, ఈ స్పెషల్ అండ్ ప్రీమియం ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్ ధర రూ.14 లక్షల వరకూ ఉండొచ్చని సమాచారం. ఈ కస్టమైజ్డ్ ఇన్నోవా ఎక్స్టీరియర్లను ఆకర్షనీయంగా, ఇంటీరియర్లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. అవేంటో చూద్దాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా

డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన ఈ టొయోటా ఇన్నోవా ఎక్స్టీరియర్లలో మార్పులు పరిమితమే, అయినప్పటికీ ఇంటీరియర్లను పూర్తిగా మార్చేశారు. తర్వాతి స్లైడ్‌లలో కస్టమైజ్డ్ ఇంటీరియర్స్‌ని చూడండి.

డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా

టొయోటా ఇన్నోవా ఇంటీరియర్స్‌ని పూర్తిగా మార్చేశారు. కోట్ల రూపాయల ఖరీదు చేసే విలాసవంతమైన కార్లలో ఉండే ఇంటీరియర్స్‌ను ఈ కస్టమైజ్డ్ ఇన్నోవాలో ఆఫర్ చేస్తున్నారు. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు.

డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా

ఈ కస్టమైజ్డ్ డిసి ఇన్నోవాలోని కారు పైభాగం (రూఫ్) మూడ్ లైటింగ్‌తో లభిస్తుంది. మన మూడ్‌ని బట్టి, ఇంటీరియర్ లైటింగ్‌ను మార్చుకోవచ్చు. అలాగే, ఈ పైభాగం స్టార్‌లైట్ రూఫ్ లైనింగ్‌తో లభిస్తుంది. రూఫ్‌లో మెరుస్తూ ఉండే చిన్నపాటి లైట్లు, ఆకాశంలోని నక్షత్రాలను తలపిస్తాయి.

డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా

వెనుక (రెండవ) వరుసలో రెండు అత్యంత విలాసలవంతమైన కెప్టెన్ సీట్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు సీట్లను ఇండివిడ్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి పూర్తి ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్‌ని కలిగి ఉంటాయి.

డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా

ఇంకా ఈ కస్టమైజ్డ్ ఇన్నోవా కారులో ఫోల్డ్ అవుట్ టేబుల్, 10వే పవర్ సీట్స్, రెండు 15.7 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్స్‌ని కూడా అమర్చారు.

డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా

దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెనుక సీట్లలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు కోసం అత్యంత సౌకర్యవంతంగా, ప్రీమియం లెథర్‌, ఫుట్ రెస్ట్, నెక్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ లతో ఏర్పాటు చేసిన సీట్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సీట్లన్నీ కూడా ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా

రూఫ్ మౌంటెడ్ లైటింగ్ కంట్రోల్ సిస్టమ్.

Most Read Articles

English summary
The Mumbai based DC Designs puts his hand on Toyota Innova and converted the rear two rows into a single lounge, seating capacity for 2 persons to provide comfort to each and every part of the body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X