టొయోటా ఇన్నోవా కోసం డిసి డిజైన్స్ నుంచి లాంజ్ ప్యాకేజ్
వెహికల్ కస్టమైజేషన్‌లో అత్యంత పాపులర్ అయిన ఇండియన్ కంపెనీ డిసి డిజైన్స్ గతంలో టొయోటా ఇన్నోవా కోసం ఓ లాంజ్ ప్యాకేజ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ కస్టమైజేషన్ హౌస్ తాజాగా మరో ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్‌ను కూడా ప్రవేశపెట్టింది. బీజ్ కలర్ ఇంటీయర్స్ థీమ్, మోడిఫైడ్ రెడ్ కలర్ ఎక్స్టీరియర్లతో కంపెనీ ఈ ప్యాకేజ్‌ను అందిస్తోంది.
అంతేకాకుండా, తమ ఇన్నోవాను తమకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసేందుకు కూడా డిసి డిజైన్స్ సిద్ధంగా ఉంది. తాజాగా తాము ప్రవేశపెట్టిన బీజ్ ఇంటీరియర్స్ ప్యాకేజ్ ప్రారంభ ధర రూ.5.5 లక్షలని కంపెనీ పేర్కొంది. ఈ కస్టమైజ్డ్ ఇన్నోవా ఎక్స్టీరియర్లను ఆకర్షనీయంగా, ఇంటీరియర్లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. అవేంటో చూద్దాం రండి..!
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన ఈ టొయోటా ఇన్నోవా ఎక్స్టీరియర్లలో మార్పులు పరిమితమే, అయినప్పటికీ ఇంటీరియర్లను పూర్తిగా మార్చేశారు. ఈ ప్యాకేజ్ ప్రారంభ ధర రూ.5.5 లక్షలు. కస్టమర్ల చాయిస్‌ను బట్టి ఈ ప్యాకేజ్ రేటు మారుతూ ఉంటుంది.

కోట్ల రూపాయల ఖరీదు చేసే విలాసవంతమైన కార్లలో ఉండే ఇంటీరియర్స్‌ను కేవలం అతి తక్కువ మొత్తంలోనే ఈ కస్టమైజ్డ్ ఇన్నోవాలో పొందవచ్చు. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు, వినోదం కోసం పెద్ద స్క్రీన్, ల్యాప్ టాప్/ఫుడ్ ట్రే, కప్ హోల్డర్స్, శీతల పానీయాలను భద్రపరచుకునేందుకు చిన్నసైజు ఫ్రిడ్జ్ వంటి ఫీచర్లను ఇందులో జోడించారు.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెనుక సీట్లలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు కోసం అత్యంత సౌకర్యవంతంగా, ప్రీమియం లెథర్, ఫుట్ రెస్ట్, నెక్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ లతో ఏర్పాటు చేసిన సీట్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సీట్లన్నీ కూడా ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

ఇంటీరియర్ థీమ్ కూడా మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. క్రోమ్ గార్నిష్, ఉడ్ ఫినిష్, స్పీకర్స్, ఇల్యుమినేషన్ (లైటింగ్), మ్యాగజైన్ హోల్డర్స్‌తో కస్టమైజ్ చేసిన డిసి ఇన్నోవా డోర్స్ కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు.

ఫ్రంట్ ప్యాసింజర్ సీటును అత్యంత విలాసవంతమైన రీతిలో, ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకునే వెసలుబాటుతో కస్టమైజ్ చేశారు. ఈ టొయోటా ఇన్నోవా డిజి లాంజ్‌లో ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత అత్యంత విలాసవంతమైన అనుభూతిని కల్పిస్తుంది. ఈ కస్టమైజ్డ్ కారు జోడించిన కొత్త స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, దీనికి మరింత ప్రీమియం లుక్‌ని కల్పిస్తాయి.
మరి మీ ఇన్నోవాను కూడా ఇలా మార్చుకోవాలనుకుంటున్నారా..? అయితే వెంటనే మీకు సమీపంలో ఉన్న డిసి డిజైన్ షోరూమ్‌ను సంప్రదించండి.


Click it and Unblock the Notifications








