లీటరుపై రూ.1 పెరిగిన డీజిల్ ధర; అర్థరాత్రి నుంచి అమలు

డీజిల్ ధర మరోసారి భగ్గుమంది. తాజాగా లీటరు డీజిల్‌పై ఒకేసారి రూ.1.09 చొప్పున పెంచుతున్నట్లు (స్థానిక పన్నులు కలుపుకోకుండా) చమురు కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన డీజిల్ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.

డీజిల్ ధరలపై ప్రభుత్వం క్రమంగా తమ నియంత్రణను ఎత్తివేసే లక్ష్యంలో భాగంగా, ప్రతినెల డీజిల్‌పై 50 పైసల చొప్పున పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, చమురు కంపెనీలు తాజాగా డీజిల్ ధరను సవరించాయి.

ఎన్నికల నేపథ్యంలో, ప్రభుత్వం గడచిన రెండు నెలలుగా డీజిల్ ధరను పెంచలేదు. ఇటీవలే ఎన్నికలు ముగియడంతో ఒక్కసారిగా డీజిల్ ధరలను పెంచింది. పన్నులతో కలిపి హైదరాబాద్‌లో డీజిల్ ధర లీటరుకు రూ.1.33 పెరిగింది. దీంతో ఇప్పటి వరకు లీటరు డీజిల్ రూ.60.46 లుగా ఉండగా, అది నేటి నుండి రూ.61.79కి పెరిగింది.

Diesel Price Hiked

కాగా.. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇంధన నష్టాలను పూర్తిగా తొలగే వరకు, మార్కెట్‌ నిర్ధారిత ధరలు అమలయ్యే వరకు ప్రతి నెలా ధరలను 50 పైసల వరకు పెంచాలని 2013 జనవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల నేపథ్యంలో, డీజిల్ ధరలను పెంచితే, అది ఓటర్లపై ప్రభావం చూపుతుందున్న నెపంతోనో ఏమో తెలియదు కానీ, ప్రతినెలా 50 పైసల చొప్పున పెంచాల్సిన డీజిల్ ధరను గడచిన ఏప్రిల్, మే నెలల్లో పెంచలేదు. ఈ నేపథ్యంలోనే, ఎన్నికలు ముగిసిన తక్షణమే, డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

తాజా పెంపుతో 2013 జనవరి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు లీటరుకు రూ.8.33 వరకూ పెరిగింది. ఇంతమేర ధరలు పెంచుతున్నప్పటికీ, ఇంకా చమురు కంపెనీలు సబ్సిడి ధరకే డీజిల్‌ను విక్రయిస్తుండటం వలన లీటరుపై రూ.6.80 నష్టం వస్తోందని ప్రకటిస్తుండటం గమనార్హం.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2014, 20:42 [IST]
English summary
Oil companies hiked diesel prices by Rs 1.09 per litre excluding taxes and will come into effect from Monday midnight.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+