మూడు వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు డ్రైవ్‌స్పార్క్
మా విలువైన 'తెలుగు వన్ఇండియా' మరియు 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' పాఠకులందరికీ శుభోదయం. మీరు ఇంతకాలం ఎంతగానో ఆదిరిస్తూ వచ్చిన మా ఆటోమొబైల్ విభాగం "తెలుగు డ్రైవ్‌స్పార్క్" నేటితో (నవంబర్ 11, 2014)తో విజయవంతంగా మూడు వసంతాలను పూర్తి చేసుకుని నాల్గవం వసంతంలోకి అడుగుపెట్టింది. (11.11.2011వ తేదీన డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం).
ఈ సందర్భంగా, మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ వెబ్‌సైట్‌కు ఇంతటి గొప్ప ప్రజాదరణ తెచ్చిపెట్టడంలో సహకరించిన మా పాఠకులందరికీ పేరు పేరునా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
దేశ బాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇదే మాటకు కట్టుబడిన మా తెలుగు డ్రైవ్‌స్పార్క్, ప్రపంచం నలుమూలల్లో ఉన్న తెలుగు వారి కోసం, అందులోనూ ప్రత్యేకించి ఆటోమొబైల్ ప్రియుల కోసం ప్రత్యేక కథనాలను తెలుగు బాషలో ప్రచురిస్తోంది.
ఆటోమొబైల్ ప్రపంచంలోని వార్తా కథనాలు, కొత్త కార్ల సమీక్షలు, కార్యక్రమాలు, ఆటోమొబైల్ చిట్కాలు, ఆటోవిడిభాగాలకు సంబంధించిన సమాచారం, ఆకర్షనీయమైన కార్లు మరియు బైక్‌ల చిత్రాలు, వీడియోలు, సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలు మరియు కొనుగోళ్లకు సంబంధించి సమాచారం మరియు కొత్త కార్లను శోధించడం కోసం రీసెర్చ్ టూల్స్ లాంటివి ఎన్నో మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ అందిస్తోంది.

తెలుగు డ్రైవ్‌స్పార్క్‌లో ప్రత్యేకించి ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ప్రచురించడం జరుగుతుంది. ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోని నలుమూలల జరిగే ఆటోమొబైల్ వింతలు విశేషాల గురించి సంపూర్ణమైన, విలువైన మరియు విశ్లేషణాత్మకమైన కథనాలను మా పాఠకులకు పరిచయం చేయటం జరుగుతుంది.
మా మాతృ వెబ్‌సైట్ 'డ్రైవ్‌స్పార్క్' (www.drivespark.com) భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంగ్లంతో పాటు ఐదు ప్రాంతీయ భాషలలో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మళయాలం) ఆటోమొబైల్ వార్తా విశేషాలను అందిస్తున్న ఏకైక వెబ్‌సైట్.
గొప్ప విషయం ఏటంటే.. మీరు ఇంతగా ఆదరిస్తూ వచ్చిన తెలుగు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ మరికొద్ది రోజుల్లోనే సరికొత్త లుక్ అండ్ ఫీల్‌తో, తాజా డిజైన్‌తో మీ ముందుకు రాబోతోంది. సామాన్య నెటిజెన్ సైతం సులువుగా అర్థం చేసుకునేలా ఈ డిజైన్ ఉండబోతోంది. అంతేకాకుండా, ఈసారి మరిన్ని అదనపు టూల్స్, క్యాలుక్యులేటర్స్‌ను కూడా డ్రైవ్‌స్పార్క్ మీకు పరిచయం చేయబోతోంది.
గడచిన మూడేళ్లుగా మా ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ధిలోకి తీసుకువచ్చిన మా విలువైన పాఠకులందరికీ ఈ సందర్భంగా మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.


Click it and Unblock the Notifications








