హైహీల్స్ కన్నా స్లిప్పర్స్‌తో డ్రైవింగే అత్యంత ప్రమాదకరం

By Ravi

హైహీల్స్ ధరించి కారును నడుపటం కన్నా ఫ్లిప్ ఫ్లాప్స్ (సాధారణ పాదరక్షలు) ధరించి కారు నడపటం అత్యంత ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. ప్రధానంగా మహిళలకు సేవలందించే బ్రిటన్‌కు చెందిన షీలాస్ వీల్స్ అనే బీమా కంపెనీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఫ్లిప్ ఫ్లాప్స్ (స్లిప్పర్స్) ధరించి కార్లు నడపటం వలన ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది.

ఒక్క అమెరికాలోనే ఫ్లిప్ ఫ్లాప్స్ ధరించి కారు నడపటం వలన 14 లక్షల ప్రమాదాలు నమోదైనట్లు మరొక నివేదిక వెల్లడిస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం, ఫ్లిప్ ఫ్లాప్స్ ధరించి కారు నడుపుతున్నప్పుడు, కాలును యాక్సిలేటర్ నుంచి బ్రేక్ పెడల్ పైకి అలాగే బ్రేక్ పెడల్ నుంచి యాక్సిలరేటర్ పెడల్‌కు మార్చేటప్పు జాప్యం జరగటమే కాకుండా, షూ ధరించి డ్రైవ్ చేయటంతో పోల్చుకుంటే డ్రైవర్ బ్రేక్ ఫోర్స్‌ను 3 శాతం తగ్గిస్తుందని వెల్లడైంది.

Driving Wearing Flip Flops Is Dangerous Proves Study

ఈ రిపోర్ట్ ప్రకారం, దాదాపు సగం మందికి పైగా మోటారిస్టులు తమకు సరిపోని (సూట్ కానటువంటి) పాదరక్షలు ధరించి డ్రైవ్ చేస్తున్నారని, ప్రతి ఐదు మందిలో ఒకరు అసౌకర్యమైన పాదరక్షలు ధరిస్తున్నారని ఫలితంగా వారు ప్రమాదాలకు గురికావటం లేదా ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకోవటం జరిగి ఉంటుందని తేలింది. అంతేకాకుండా, ప్రతి నలుగురిలో ఒకరు కారులోని పెడల్స్ మధ్యలో తమ స్లిప్పర్స్ చిక్కుపోయిన భయంకర అనుభూతిని కూడా ఎదుర్కొన్నట్లు తేలింది.

అనేక మంది డ్రైవర్లు తాము ధరించే పాదరక్షలే ప్రమాదాలకు కారణమవుతాయనే విషయాన్ని గుర్తించకపోవటం చాలా విచారకరమని, లక్షలాది మంది తాము సురక్షితంగా డ్రైవ్ చేస్తున్నామని అనుకుంటారని కానీ, వారి ప్రమాదాలకు ఫ్లిప్ ఫ్లాప్స్ ధరించి డ్రైవ్ చేయటమే కారణమని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుందని సదరు ఇన్సూరెన్స్ కంపెనీకు చెందిన జాక్ బ్రౌన్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Thursday, August 29, 2013, 12:42 [IST]
English summary
A Study conducted by Sheilas' Wheels, a British insurance company that mainly caters to women, has found that driving cars wearing flip flops can lead to accidents. Another report states flip flops are behind 1.4 million accidents in the U.S alone.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+