ఎలియో మూడు చక్రాల కారుకు 10,000 లకు పైగా బుకింగ్స్!

By Ravi

ఈ ఫొటోలోని మూడు చక్రాల కారు గురించి ఎక్కడో చదివినట్లుంది కదూ..! గడచిన జులై నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ఈ ఎలియో కారు గురించి ప్రచురించడం జరిగింది. విశిష్టమైన డిజైన్‌తో అప్పుడు వార్తల్లోకెక్కిన ఈ కారు మరోసారి తాజాగా వార్తల్లో ప్రధానంశంగా నిలిచింది. ఈ కారుకు ఇప్పటికే, 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని ఎలియోస్ మోటార్స్ పేర్కొంది.

అమెరికాకు చెందిన పాల్ ఎలియో ఈ మూడు చక్రాల కారు (ట్రైక్)ను సృష్టించాడు. తన పేరుతోనే ఈ కారుకు 'ఎలియో' (Elio) అనే పేరును పెట్టాడు. పెరుగుతున్న ఇంధన ధరలు, నానాటికీ అధికమవుతున్న వాహనాల సంఖ్యతో రోడ్లపై అలాగే పార్కింగ్ ప్రదేశాల్లో తగ్గుతున్న స్థలం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని పాల్ ఎలియో ఈ కారును తయారు చేశాడు.

ఎలియో టూ సీటర్ కారు. ఇందులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. అందులో ఒక డ్రైవర సీట్, దానికి వెనుకన మరొక ప్యాసింజర్ సీట్ ఉంటాయి. రెగ్యులర్ కార్ల మాదిరిగానే ఇందులో స్టీరింగ్, బ్రేక్స్, క్లచ్ పెడల్స్, ట్రాన్సిమిషన్ వంటి అన్ని కంట్రోల్స్ ఉంటాయి.

దీని ధర, ఇంజన్, మైలేజ్ తదితర వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

ఇంజన్

ఇంజన్

ఇందులో ఉపయోగించిన ఇన్‌లైన్ 3-సిలిండర్, 1-లీటర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 70 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంటుంది.

మైలేజ్

మైలేజ్

ఇది లీటరు పెట్రోలుకు 35 కి.మీ. పైగా మైలేజీనిస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 30 లీటర్లు. దీనిని ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే 1050 కి.మీ. దూరం పైగా ప్రయాణించవచ్చు.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

ప్రతి ఎలియో కారు కూడా సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో 3 ఎయిర్‌బ్యాగ్‌లు, రీఇన్‌ఫోర్స్డ్ రోల్-కేజ్ ఫ్రేమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), 50 శాతం పెద్ద క్రష్ జోన్స్ ఫీచర్లున్నాయి.

మేడ్ ఇన్ అమెరికా

మేడ్ ఇన్ అమెరికా

పూర్తిగా అమెరికాలో తయారైన ఎలియో కారు ప్రస్తుతానికి అక్కడి మార్కెట్లో మాత్రమే లభ్యం కానుంది. ష్రెవ్‌పోర్టులో ఉన్న ఈ ప్లాంటులో సుమారు 1500 మంది ఉపాధి లభించనుంది.

విశిష్టమైనది, ఈకో-ఫ్రెండ్లీ

విశిష్టమైనది, ఈకో-ఫ్రెండ్లీ

ఇతర చిన్న కార్లతో పోల్చుకుంటే ఎలియో విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనం.

ఫాస్ట్ ఫ్యాక్ట్స్

ఫాస్ట్ ఫ్యాక్ట్స్

ఎలియో గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఇది కేవలం 9.6 సెకండ్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ వేగం సూపర్ కార్లంత వేగం కాకపోయినప్పటికీ, ఎలియో మాత్రం వేగం విషయంలో సాధారణ కార్లకు ఏమాత్రం తీసిపోదు.

సురక్షితమైన బ్రేకింగ్

సురక్షితమైన బ్రేకింగ్

ఈ కారుకు అమర్చిన మూడు 15 ఇంచ్ చక్రాలలో 3-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి ఏబిఎస్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. కాబట్టి ఇవి సురక్షితమైన బ్రేకింగ్ వ్యవస్థను అందిస్తుంది.

సస్పెన్షన్

సస్పెన్షన్

అసమాన పొడవు కలిగిన కంట్రోల్ ఆర్మ్స్, కాయిల్ ఓవర్ స్పింగ్ మరియు షాక్ అబ్జార్వర్లతో ముందువైపు ఇండిపెండెంట్ సస్పెన్షన్ అలాగే వెనుక వైపు బైక్‌లలో గమనించినట్లు మోనో-షాక్ కాయిల్ స్పింగ్ షాక్ అబ్జార్వర్‌తో ఇది లభిస్తుంది.

ఇంటీరియర్ రూమ్

ఇంటీరియర్ రూమ్

హెడ్‌రూమ్ : డ్రైవర్ 39.8, ప్యాసింజర్ 36.4 ఇంచ్‌లు

సీట్ వెడల్పు : డ్రైవర్ 20.6, ప్యాసింజర్ 25.3 in, ఇంచ్‌లు

షోల్డర్ రూమ్ : 26.8 ఇంచ్‌లు

ముందు సీట్ లెగ్‌రూమ్ : 42.7 ఇంచ్‌లు

వెనుక సీట్ లెగ్‌రూమ్ : 33.1 ఇంచ్‌లు

ఎక్స్టీరియర్ కొలతలు

ఎక్స్టీరియర్ కొలతలు

మొత్తం వీల్ పొడవు : 160.5″

ముందు వీల్ ట్రాక్ : 66.8″

వీల్‌బేస్ : 110″

మొత్తం ఎత్తు : 54.2″

నిశ్శబ్ధ క్యాబిన్

నిశ్శబ్ధ క్యాబిన్

బయటి వైపు శబ్ధాలు కారు లోనికి ప్రవేశించకుండా ఉండేలా, దీని బాడీ ప్యానెళ్లను తేలికమైన మరియు ధృఢమైన మెటీరియర్‌లతో తయారు చేశారు. దీన్ని నడుపుతున్నప్పుడు ఇది షేక్ అవుతున్న భావన కూడా కలుగదు.

లగేజ్ స్పేస్

లగేజ్ స్పేస్

లగేజ్ తీసుకువెళ్లాలనుకున్నప్పుడు వెనుక సీటను మడిచిపెట్టేయవచ్చు. ఇందులో ఓ ఎయిర్‌లైన్ క్యారీఆన్ బ్యాగ్ లేదా గోల్ఫ్ బ్యాగ్‌ను ఉంచేంత స్థలం ఉంటుంది.

మరిన్ని ఫీచర్లు

మరిన్ని ఫీచర్లు

ఇంకా ఇందులో హీటర్‌తో కూడిన ఏసి, ఏఎమ్/ఎఫ్ఎమ్ రేడియో, డీఫ్రోస్ట్, 3 ఎయిర్‌బ్యాగ్స్, పవర్ విండోస్, డోర్ లాక్, సీట్ బెల్ట్స్, ట్యాంపర్డ్ గ్లాస్, విండ్‌షీల్డ్ వైపర్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

ధర

ధర

ఎలియో కారు ధర కేవలం 6800 అమెరికన్ డాలర్లు మాత్రమే. మన దేశ కరెన్సీలో సుమారు రూ.4 లక్షలు.

More from DriveSpark

Article Published On: Saturday, March 8, 2014, 10:35 [IST]
English summary
Elio Motors announced that reservations for its aerodynamic, enclosed 3-wheel vehicle surpassed 10,000. The high level of interest is evidence that consumers are clamoring for an entirely new type of transportation option, according to Paul Elio, Founder and CEO of Elio Motors.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+