2013 జెనీవా మోటార్ షో: లాఫెరారీ హైపర్ కారు విడుదల

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ ఫెరారీ 2013 జెనీవా మోటార్ షోలో ఓ సరికొత్త హైపర్‌కారును విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. నేడు ప్రారంభమైన 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో ఫెరారీ తమ కొత్త హైపర్ కారును ఆవిష్కరించింది. ఫెరారీ ఎన్జో మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చిన ఈ కారుకు కంపెనీ 'లాఫెరారీ' (LaFerrari) అనే పేరును ఖరారు చేసింది.

లాఫెరారీ ఒక హైబ్రిడ్ కారు. ఇది డ్యూయెల్ పవర్ (పెట్రోల్ + బ్యాటరీ)తో పనిచేస్తుంది. లాఫెరారీ హైపర్‌కారులో 6.3 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 800 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో అమర్చిన 120 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 163 హెచ్‌‌పిల గరిష్ట శక్తిని, 270 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండు కలిసి గరిష్టంగా 963 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.

లాఫెరారీ హైపర్‌కారు కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15 సెకండ్లలో 0-300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఫెరారీ కంపెనీ కేవలం 499 లాఫెరారీ కార్లను ఉత్పత్తి చేయనుంది. అయితే దీని ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇది 10 లక్షల యూరోలకు పైగా ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7 కోట్లకు పైమాటే. మరి ఈ లాఫెరారీ అందాలను తిలకిద్దాం రండి.

2013 జెనీవా మోటార్ షో: లాఫెరారీ హైపర్‌కారు

More from DriveSpark

Article Published On: Tuesday, March 5, 2013, 17:45 [IST]
English summary
Italian supercar manufacturer Ferrari has unveiled the Enzo successor 'LaFerrari' at 2013 Geneva Motor Show. LaFerrari is the first production hybrid car from Ferrari, combining a 789bhp 6.3-litre V12 with a 120kW electric motor, for a total output of 950bhp. It accelarates 0-100 km/h in less than 3 seconds, 0-300 km/h in 15 seconds. Top speed in excess of 350 km/h.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+