యూరోపియన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా విడుదల

By Ravi

ఇటీవలే అమెరికా మార్కెట్ల కోసం అప్‌గ్రేడెడ్ 2014 కరోలా సెడాన్‌ను విడుదల చేసిన జపాన్ ఆటో దిగ్గజం టొయోటా, తాజాగా యూరోపియన్ వెర్షన్ 2014 కరోలా సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ రెండు వెర్షన్లలో ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ పరంగా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి.

యూరో-స్పెక్ 2014 టొయోటా కరోలా సెడాన్‌లో ప్రధాన క్రోమ్ గ్రిల్, బంపర్‌లో చిన్న ఎయిర్ ఇన్‌టేక్, ఫ్రంట్ ఆప్రాన్స్ వరకు స్ట్రెచ్ చేసిన పెద్ద హెడ్‌లైట్స్, రివైజ్డ్ గ్రిల్, కొత్త బానెట్ డిజైన్, బాడీ లైన్స్, పెద్ద ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, రియర్ వ్యూ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు సన్నటి మరియు పొడవాటి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రెండు టెయిల్ ల్యాంప్స్ మధ్యలో క్రోమ్ స్ట్రిప్, వెనుక బంపర్‌‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు వంటి బాహ్య మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇంటీరియర్స్ విషయంలో అమెరికన్ వెర్షన్ మరియు యూరోపియన్ వెర్షన్ కరోలా ఫీచర్లు దాదాపు ఒకేవిధంగా ఉన్నాయి. ఇందులో డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్‌కు బదులు బ్లాక్ కలర్ ఇంటీరియర్స్, రౌండ్ డయల్స్‌తో కూడిన స్పోర్టీయర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కొత్త సీట్ అప్‌హోలెస్టరీ వంటి మార్పులను చూడొచ్చు. మొత్తమ్మీద చూసుకుంటే, అమెరికన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటే, యూరోపియన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా ప్రీమియం ఎగ్జిక్యూటివ్ లుక్‌ను కలిగి ఉంటుంది.

ఇంజన్ పరంగా ఈ రెండు వెర్షన్లలో ఎలాంటి మార్పు లేదు. టొయోటా కరోలా రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది. అందులో ఒకటి 132 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్, మరొకటి 140 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్. ఈ కారులో కొత్తగా పెట్రోల్ వెర్షన్‌లో 7-స్పీడ్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ట్రాన్సిమిషన్‌ను జోడించారు. దీని వలన ఇది మెరుగైన మైలేజీని ఆఫర్ చేయనుంది. యూరోపియన్ వెర్షన్ కరోలా ఇండియాకు కూడా వచ్చే ఆస్కారం ఉంది. అయితే దీని కోసం 2014 వరకు ఆగాల్సిందే.

యూరోపియన్ వెర్షన్ కరోలా

యూరోపియన్ వెర్షన్ కరోలా

ఫ్రంట్ ప్రొఫైల్

ఫ్రంట్ ప్రొఫైల్

రియర్ ప్రొఫైల్

రియర్ ప్రొఫైల్

సైడ్ ప్రొఫైల్

సైడ్ ప్రొఫైల్

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఫ్రంట్ క్రోమ్ గ్రిల్

ఫ్రంట్ క్రోమ్ గ్రిల్

ఎల్ఈడి హైడ్‌లైట్స్

ఎల్ఈడి హైడ్‌లైట్స్

షార్ప్ టెయిల్ ల్యాంప్స్

షార్ప్ టెయిల్ ల్యాంప్స్

ప్రీమియం సీట్స్

ప్రీమియం సీట్స్

విశాలమైన రియర్ సీట్

విశాలమైన రియర్ సీట్

స్పోర్టీయర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

స్పోర్టీయర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ప్రీమియం డ్యాష్‌బోర్డ్

ప్రీమియం డ్యాష్‌బోర్డ్

రూఫ్ మౌంటెడ్ గ్లౌవ్ బాక్స్

రూఫ్ మౌంటెడ్ గ్లౌవ్ బాక్స్

ఫ్రంట్ వ్యూ

ఫ్రంట్ వ్యూ

టాప్ వ్యూ

టాప్ వ్యూ

యూరోపియన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా
యూరోపియన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా
యూరోపియన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా
యూరోపియన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా
యూరోపియన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా
యూరోపియన్ వెర్షన్ 2014 టొయోటా కరోలా

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2013, 12:03 [IST]
English summary
After revealing a sporty looking Toyota Corolla in the U.S., the sedan's largest market now the Japanese car maker has released the first pictures of the European-spec Corolla with exterior styling changes and mild interior changes. Have a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+