2013 జెనీవా మోటార్ షో: ఎక్సాగన్ ఫర్టివ్-ఈజిటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్
బ్యాటరీ పవర్‌తో నడిచే కార్లు ఏం స్పీడ్ వెళ్తాయ్‌లే అనుకుంటే పొరపాటే. ఇదిగో ఈ ఫోటోల కనిపిస్తున్న ఎలక్ట్రిక్ కారును చూడండి. ఇది గరిష్టంగా గంటకు 155 మైళ్ల (250 కిలోమీటర్ల) వేగంతో పరుగులు తీస్తుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎక్సాగన్ మోటార్స్ (Exagon Motors) ఈ సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ స్పోర్ట్స్ కారును తయారు చేసింది. 'ఎక్సాగన్ ఫర్టివ్-ఈజిటి' (Exagon Furtive-eGT) అనే ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు పూర్తిగా బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది.
రియర్ వీల్ డ్రైవ్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో రెండు సీమెన్స్ మోటార్లను అమర్చారు. ఇవి రెండు గరిష్టంగా 148 కిలోవాట్ల (198 బిహెచ్‌పిల) శక్తిని 516 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఈ మోటార్లు పరిమాణంలో చాలా చిన్నగా ఉండి, మంచి పెర్ఫామెన్స్‌ను అందిస్తాయి. ఇవి లిథియం-ఐయాన్ బ్యాటరీలతో పనిచేస్తాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం 1,50,000 కిలోమీటర్ల వరకూ వీటికి మెయింటినెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో జెడ్‌టిఐ త్రీ-స్పీడ్ సెమీ-ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది.
ఎక్సాగన్ ఫర్టివ్-ఈజిట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల (155 మైళ్లు) వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 3.5 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ఎక్సాగన్ మోటార్స్ ఈ అధునాతన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు మొత్తం బరువు 450 కిలోలు మాత్రమే. ఇందులోని బ్యాటరీలు కేవలం 32 నిమిషాల వ్యవధిలోనే 30 నుంచి 80 శాతం మధ్యలో ఛార్జ్ అవుతాయి. ఎక్సాగన్ ఫర్టివ్-ఈజిట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ధర సుమారు రూ.2.4 కోట్లు.

ఎక్సాగన్ ఫర్టివ్-ఈజిటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్

Click it and Unblock the Notifications