డిసెంబర్ 2014 వరకు ఎక్సైజ్ డ్యూటీ కట్ కొనసాగింపు
భారత ఆటోమొబైల్ రంగానికి గుడ్ న్యూస్.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అప్పటి ప్రభుత్వం (కాంగ్రెస్) ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఆటోమొబైల్ వాహనాలపై తగ్గించిన ఎక్సైజ్ సుంకాలు ఈనెల (జూన్) 30 నాటికి గడువు తీరిపోనున్నాయి.
ఈ నేపథ్యంలో, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం (బిజెపి) కూడా ఎక్సైజ్ రాయితీలను అలానే కొనసాగించాలని ఇటు ప్రజలు అటు కార్ కంపెనీలు కోరుకోవటంతో, మోడీ సర్కారు ఎక్సైజ్ డ్యూటీ కట్‌ను డిసెంబర్ 2014 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

ఇదివరకటి మధ్యంతరో బడ్జెట్‌లో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు). అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు). ఎస్‌యూవీలపై సుంకాన్ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిన (6 శాతం తగ్గింపు) విషయం తెలిసినదే. తాజా నిర్ణయంతో, ప్రసుతం ఎక్సైజ్ డ్యూటీ రేచ్లు ఈ ఏడాది చివరి వరకు అమల్లో ఉంటాయి.

గత కొద్ది నెలలుగా భారత ఆటోమొబైల్ రంగం మందగమనంలో కొనసాగడంతో కొత్త ప్రభుత్వం ఈ రాయితీలు కొనసాగించేందుకు ముందుకొచ్చింది. కాంగ్రెస్ సర్కారులోని అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రకారం ఈ రాయితీలు జూన్ 30, 2014తో ముగుస్తాయి. కాగా కొత్తగా ఏర్పాడి బిజెపి సర్కారులోని ప్రస్తుత ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ దీనిని మరో ఆరు నెలల పాటు (డిసెంబర్ 2014 నెలాఖరు వరకు) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Click it and Unblock the Notifications








