భారత్‌లో ఫేస్‌లిఫ్ట్ వోల్వో ఎస్60, ఎక్స్‌సి60 కార్లు విడుదల

స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ కంపెనీ వోల్వో ఇండియా, దేశీయ విపణిలో రెండు అప్‌గ్రేడెడ్ మోడళ్లను విడుదల చేసింది. కంపెనీ ఎస్60 సెడాన్, ఎక్స్‌సి60 ఎస్‌యూవీలలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను వోల్వో ఇండియా నేడు (అక్టోబర్ 23, 2013) మార్కెట్లో ప్రవేశపెట్టింది.

అప్‍‌గ్రేడెడ్ వోల్వో ఎస్60, వోల్వో ఎక్స్‌సి60 కార్లు కొత్త ఫ్యామిలీ లుక్‌ను కలిగి ఉండి, అధునాతన సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ఈ రెండు కార్లలో ముందు వైపు సరికొత్త డిజైన్‌ను గమనించవచ్చు. వోల్వో ఎస్60లో కొత్త ఇంటీరియర్ ట్రిమ్‌నును జోడించగా, ఎక్స్‌సి60 బ్లాక్ ఇంటీరియర్ ట్రిమ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.


సాంకేతికత విషయానికి వస్తే, వోల్వో ఎస్60 కారులో అడాప్టివ్ కార్నరింగ్ లైట్లను జోడించగా, వోల్వో ఎక్స్‌సి60లో టార్క్ వెక్టరింగ్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు కార్లలో కొత్త మల్టీమీడియా సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 7ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, చేతికి గ్లవ్‌లు వేసుకొని ఆపరేట్ చేసినా ఇది పనిచేస్తుంది.

ఈ రెండు మోడళ్లలో ఆటోమేటిక్ వెర్షన్లకు స్టీరింగ్ వీల్‌పై ప్యాడల్ షిఫ్ట్ (సులువుగా గేర్లు మార్చుకునేందుకు వీలుగా ఉండే స్విచ్‌ల)ను జోడించారు. వోల్వో ఎస్60, వోల్వో ఎక్స్‌సి రెండు మోడళ్లు కూడా మూడు వేరియంట్లలో లభిస్తాయి. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Volvo XC60
  • వోల్వో ఎస్60 డి4 కింటెక్: రూ. 29.90 లక్షలు
  • వోల్వో ఎస్60 డి4 సమ్మం: రూ. 32.50 లక్షలు
  • వోల్వో ఎస్60 డి5 సమ్మం: రూ. 35.50 లక్షలు
  • వోల్వో ఎక్స్‌సి60 డి4 కింటెక్: రూ. 40.50 లక్షలు
  • వోల్వో ఎక్స్‌సి60 డి4 సమ్మం: రూ. 43.50 లక్షలు
  • వోల్వో ఎక్స్‌సి60 డి5 సమ్మం: రూ. 46.55 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, October 23, 2013, 16:07 [IST]
English summary
Swedish carmaker Volvo has launched its updated S60 saloon and XC60 SUV in India with the price tag of Rs 29.90 lakh & Rs 40.50 lakh respectively (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+