ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా సక్సెసర్ ఫెరారీ 458 స్పెషల్

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫెరారీ అందిస్తున్న 'ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా' (Ferrari F430 Scuderia)కు సక్సెసర్‌గా 'ఫెరారీ 458 స్పెషల్' (Ferrari 458 Speciale)ను కంపెనీ ఆవిష్కరించింది. ఫెరారీ 458 ఇటాలియా విడుదలై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ మోడల్‌ను అభివృద్ధి చేశారు.

ఫెరారీ 458 స్పెషల్ (ఇటాలియన్ భాషలో దీనిని 'ఫెర్రారీ 458 స్పిచాలే' అని పిలుస్తారు) సూపర్ కారును వచ్చే నెలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శించనున్నారు. ఎఫ్430 మోడల్‌కు మిడ్-లైప్ అప్‌గ్రేడ్ వెర్షనే ఎఫ్430 స్కుడెరియా అని వర్ణించవచ్చు. అలాగే 458 ఇటాలియాకు వెర్షన్ 2.0నే 458 స్పెషల్‌గా పరిగణించడం జరుగుతుంది.

మరి అందాల ఫెరారీ 458 స్పెషల్‌లోని స్పెషాలిటీ ఏంటో ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

ఫెరారీ 458 స్పెషల్

ఫెరారీ 458 స్పెషల్‌లో ఇంజన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. 458 ఇటాలియాలో ఉపయోగించిన 562 హార్స్ పవర్, 4.5 లీటర్, వి8 ఇంజన్‌నే ఈ కారులోను ఉపయోగించారు. అయితే, దీని పవర్‌ను మాత్రం కొద్దిగా పెంచి (597 హార్స్ పవర్‌కు) రీట్యూన్ చేశారు.

ఫెరారీ 458 స్పెషల్

ఫెరారీ 458 ఇటాలియాతో పోల్చుకుంటే ఫెరారీ 458 స్పెషల్ బరువు తక్కువగా ఉంటుంది. దీని మొత్తం బరువు 1290 కేజీలు మాత్రమే. లీటరుకు 133 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే వి8 ఇంజన్ కలిగిన 458 స్పెషల్ ఇప్పుడు, ఫెరారీ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన, సహజసిద్ధ వాయురేచక వి8 ఇంజన్‌గా నిలించింది.

ఫెరారీ 458 స్పెషల్

దీని కారణంగా, ఇది మంచి పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.0 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని, 9.1 సెకండ్ల వ్యవధిలోనే 0-200 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

ఫెరారీ 458 స్పెషల్

ఫెరారీ 458 స్పెషల్ కారులో కేవలం ఇంజన్ ట్యూనింగ్, బరువు తగ్గించడం వంటి మార్పులే కాకుండా, అడ్జస్టబల్ ఫ్రంట్ అండ్ రియర్ ఫ్లాప్స్‌తో కూడా లభిస్తుంది. ఇవి కారు ఎయిర్‌ ఫ్లో దిశను ఆల్టెర్ చేసి, డౌన్‌ఫోర్స్‌ను పెంచడం ద్వారా డ్రాగ్‌ను తగ్గిస్తుంది.

ఫెరారీ 458 స్పెషల్

ఈ కారులో సైడ్ స్లిప్ యాంగిల్ కంట్రోల్ (ఎస్ఎస్‌సి) అనే టెక్నాలజీని ఈ కారు డిజైన్‌లో జోడించారు. ఎస్ఎస్‌సి అనేది ఒకరకమైన బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టార్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్. ఈ సిస్టమ్ టైర్ స్లిప్ యాంగిల్‌ను పరిశీలించి ట్రాక్షన్ కంట్రోల్, టార్క్ వెక్టరింగ్ ద్వారా టార్క్‌ను టైర్లకు చేరవేస్తుంది.

ఫెరారీ 458 స్పెషల్

ఫెరారీ 458 స్పెషల్ కారులో మిచెల్లిన్ పైలట్ స్పోర్ట్ కప్ 2 టైర్లను జోడించారు. ఈ టైర్లు ల్యాప్ టైమ్‌లను మెరుగుపరస్తాయని, అలాగే ఉత్తమ ఆల్-రౌండ్ వెట్ వెథర్ ట్రాక్షన్‌ను అందిస్తాయని సమాచారం.

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2013, 13:18 [IST]
English summary
The long awaited successor to the Ferrari F430 Scuderia is finally here, four years after the launch of the 458 Italia. It's called the 458 Speciale. The powerful new 458 Speciale will be on display in Frankfurt. The 458 Speciale can thus be considered as a 458 Italia version 2.0.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+