రేస్ ట్రాక్ వెర్షన్ ఫెరారీ లాఫెరారీ 'ఎఫ్ఎక్స్ఎక్స్ కె'
ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ ఫెరారీ, ఓ సరికొత్త రేస్ ట్రాక్ వెర్షన్ కారును ఆవిష్కరించింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు పేరు ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె (FXX K). అబుదాబిలోని ఫెరారీ ఫైనలి మోండియలి వద్ద ఈ కారును ఆవిష్కరించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 జెనీవా మోటార్ షోలో ఫెరారీ ప్రదర్శించిన లాఫెరారీ హైపర్ కారును ఆధారంగా చేసుకొని, ఈ రేస్ స్పెసిఫిక్ ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారును తయారు చేశారు. ఇదొక ట్రాక్-ఓన్లీ వెర్షన్ సూపర్ కారు.
అలాగని ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె సూపర్ కారును రేస్‌లు, కాంపిటీషన్ల కోసం ఉపయోగించారు. ఇది ఫెరారీ లాఫెరారీ కన్నా అత్యంత శక్తివంతమైన కారు. పవర్‌ఫుల్ కారును తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో ఫెరారీ దీనిని రూపొందించింది. ఫెరారీ తమ ఎన్జో ఆధారిత ఎఫ్ఎక్స్ఎక్స్ మోడల్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కారుకు ఎఫ్ఎక్స్ఎక్స్ కె అనే పేరును పెట్టారు. ఇందులో కె అంటే కెర్స్ హైబ్రిడ్ సిస్టమ్‌ను తెలియజేస్తుంది. (ఇదొక హైబ్రిడ్ కారు, ఇందులో కెర్స్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు.
ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె సూపర్‌కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ఇంజన్
ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె సూపర్‌కారులో వి12, 6.3 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 848 హార్స్‌పర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని కెర్స్ హైబ్రిడ్ సిస్టమ్ 187 హార్స్‌పర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 1,035 హార్స్‌పర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్
ఇది రేస్ స్పెసిఫిక్ కావటంతో దీని ఏరోడైనమిక్స్‌ని అందుకు అనుగుణంగా మార్చారు. ఏదేమైనప్పటికీ, లాఫెరారీ కారులోని అనేక డిజైన్ ఫీచర్లను ఈ ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారులో కూడా చూడొచ్చు. స్ట్రీట్ లీగల్ లాఫెరారీతో పోల్చుకుంటే దాదాపు 50 శాతం డౌన్‌ఫోర్స్‌ను ఆఫర్ చేసేలా ఈ ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారును తయారు చేశారు. ఈ కారును టైర్లను పీరెల్లీ నుంచి గ్రహించారు. ఇవి రేసింగ్ స్లిక్ టైర్స్. ఇందులో బెటర్ స్టాపిం పవర్ కోసం 15-ఇంచ్ కార్బన్ సెరామిక్ బ్రేక్ డిస్క్ ఉపయోగించారు.

రియర్ ప్రొఫైల్
బెటర్ డౌన్‌ఫోర్స్ కోసం ఫెరారీ తమ ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారుకు వెనుక వైపు ఓ ఏరోడైనమిక్ వింగ్‌ను జోడించింది. అలాగే, డౌన్‌ఫోర్స్‌ను పెంచేందుకు గాను వెనుక వైపు పెద్ద ఎయిర్ డిఫ్యూజర్లను కూడా అమర్చారు.

ఇంటీరియర్స్
ట్రాక్ ఫోకస్డ్ కార్లలో మాదిరిగా ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కారులోని ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. రేస్ స్పెసిఫిక్ బకెట్ సీట్స్, రేస్ స్పెసిఫిక్ స్టీరింగ్ వీల్ అండ్ కంట్రోల్స్‌తో ఇంటీరియర్‌ను సింపుల్‌గా ఉంచారు.

మెక్‌లారెన్ ఆవిష్కరించిన రేస్ స్పెసిఫిక్ పి1 జిటిఆర్ వంటి మోడళ్లలో ఈ ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె మోడల్ పోటీ పడుతుంది. ఈ కారుకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఫార్ములా వన్ కారు కన్నా వేగంగా ఉండగదలని చాలా మంది భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications