భారత్‌లో ఫెరారీ హెడ్‌ఫోన్; ధర రూ.19,000 మాత్రమే

By Ravi

ఫెరారీ బ్రాండ్ అంటే ఎవరికి మాత్రం క్రేజ్ ఉండదు చెప్పండి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు వివిధ రకాల గ్యాడ్జెట్లను, యాక్ససరీలను తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, ఫెరారీ ఓ సరికొత్త హెడ్‌ఫోన్‌ను భారత్‌లో పరిచయం చేసింది.

సంగీత ప్రియులను లక్ష్యంగా చేసుకొని 'స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్' (Scuderia P200 Headphone)ను భారత్‌లో విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్‌లో అణువనువునా ఫెరారీ డిఎన్ఏ కనిపిస్తుంది. స్టయిల్, పర్సనాలిటీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ హెడ్‌ఫోన్ ధరకు తగిన విలువను కలిగి ఉంటాయి.

ఫెరారీ అభిమానుల కోసం స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్‌ను లాజిక్3 కలెక్షన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చామని సాహిల్ ఇంటర్నేషనల్ సీఈఓ సాహిల్ సానీ తెలిపారు. స్పోర్టీ డిజైన్ కలిగిన ఈ హెడ్‌ఫోన్ ప్రపంచ స్థాయి ఉత్తమ సౌండ్ క్వాలిటీ అనుభూతిని కలిగిస్తుందని, దీనిని స్కుడెరియా ఫెరారీ రేసింగ్ టీమ్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశామని కంపెనీ తెలిపింది.

అన్ని రకాల గ్యాడ్జెట్లకు కనెక్ట్ చేసుకునే విధంగా, సపోర్ట్ చేసే విధంగా ఈ హెడ్‌ఫోన్ డిజైన్ చేశారు. 3.5 మి.మీ. జాక్ ఆప్షన్ కలిగిన గ్యాడ్జెట్ల కోసం ఇందులో ఓ కనెక్టరను కూడా ఇచ్చారు. వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది బ్లాక్ లేదా రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్ ధర రూ.18,990/-గా ఉంది. మరింత సమాచారం కోసం www.ferrari-by-logic3.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్
ఫెరారీ స్కుడెరియా పి200 హెడ్‌ఫోన్

More from DriveSpark

Article Published On: Friday, June 21, 2013, 13:28 [IST]
English summary
Ferrari Scuderia P200 Headphone now available in India at a retail price of Rs.18,990. For more information visit www.ferrari-by-logic3.com.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+