పండుగ సీజన్ ఎఫెక్ట్.. కార్లపై భారీ డిస్కౌంట్స్

By Ravi

మంచి డీల్‌లో కారు కొనాలనుకునే వారికి ఈ పండుగ సీజన్ సరైన సమయం అని చెప్పొచ్చు. మరికొద్ది రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభం కానుండటంతో పలు కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ఆకర్షనీయమైన డిస్కౌంట్లు, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి.

మరోవైపు గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు కూడా తక్కువగా ఉండటంతో, అమ్మకాలను పెంచుకునేుందుకు కూడా పలు కార్ల తయారీ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. వివిధ కార్లపై సంబంధిత కార్ల కంపెనీలు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఈ క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలిద్దాం రండి.

మారుతి సుజుకి

మారుతి సుజుకి

దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అందిస్తున్న చిన్న కారు వ్యాగన్ఆర్‌పై రూ.68,000 విలువైన ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్‌లో రూ.30,000 ఎక్సేంజ్ బోనస్, రూ.35,000 క్యాష్ డిస్కౌట్, రూ.3,000 కార్పోరేట్ డిస్కౌంట్లు కలిసి ఉన్నాయి. కంపెనీ ఇటీవలే ఉత్పత్తిని నిలిపివేసిన ఎస్టిలోపై కూడా రూ.30,000 ఎక్సేంజ్ బోనస్, రూ.35,000 క్యాష్ డిస్కౌట్, రూ.3,000 కార్పోరేట్ డిస్కౌంట్లను పొందవచ్చు.

హ్యుందాయ్

హ్యుందాయ్

దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ఎలాంట్రా పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై రూ.25,000 ఎక్సేంజ్ బోనస్, రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 కార్పోరేట్ డిస్కౌంట్‍‌లను కంపెనీ ఆఫర్ చేస్తుంది.

ఫోర్డ్

ఫోర్డ్

ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌పై ఇన్సూరెన్స్‌తో కలిపి రూ.37,000 డిస్కౌంట్ లభిస్తుండగా, ఫిస్టా సెడాన్‌పై 1.2 లక్షల డిస్కౌంట్, ఎండీవర్‌పై రూ.1 లక్ష డిస్కౌంట్ లభిస్తుంది.

హోండా

హోండా

జపనీస్ కార్ కంపెనీ హోండా అందిస్తున్న సిటీ సెడాన్‌పై ఇన్సూరెన్స్‌తో పాటుగా రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుండగా, బ్రయోపై రూ.19,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటుగా రూ.10,000 నగదు తగ్గింపును కంపెనీ అందిస్తోంది.

మహీంద్రా

మహీంద్రా

యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న బొలెరో, స్కార్పియో, క్వాంటో మోడళ్లపై వరుసగా రూ.20,000, రూ.40,000, రూ.44,000 తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు.

చెవర్లే

చెవర్లే

చెవర్లే అందిస్తున్న సెయిల్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.33,000 వరకూ తగ్గింపులను అందిస్తుండగా, సెయిల్ సెడాన్‌పై రూ.33,000 వరకూ తగ్గింపులను అందిస్తున్నారు.

టొయోటా

టొయోటా

టొయాటా అందిస్తున్న ఎతియోస్ సెడాన్‌పై రూ.21,000 డిస్కౌంట్ (ఇన్సూరెన్స్), ఇన్నోవాపై రూ.10,000 ఎక్సేంజ్ బోనస్‌కు అదనంగా రూ.15,000 క్యాష్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ

సాధారణ కార్లపైనే కాకుండా లగ్జరీ కార్లపై కూడా మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ కార్లపై రూ.3-5 లక్షల డిస్కౌంట్, 5-సిరీస్‌పై రూ.6 లక్షల వరకూ డిస్కౌంట్స్, ఎక్స్1 ఎస్‌యూవీపై 4.5 లక్షల వరకు డిస్కౌంట్స్ లభ్యం కానున్నాయి.

ఆడి

ఆడి

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా అందిస్తున్న ఏ4 సెడాన్‌పై సుమారు రూ.4-5 లక్షల డిస్కౌంట్స్ (వేరియంట్‌ను బట్టి మారుతుంది), ఏ6 సెడాన్‌పై రూ.5 లక్షల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి (వేరియంట్‌ను బట్టి మారుతుంది).


గమనిక: ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు డీలర్‌షిప్ నుంచి డీలర్‌షిప్‌కు, ప్రాంతం నుంచి ప్రాంతానికి వేర్వేరుగా ఉంటాయి. వివిధ డీలర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ప్రచురించడమైనది.

More from DriveSpark

Article Published On: Monday, September 2, 2013, 13:20 [IST]
English summary
Car Makers are offering massive discount on cars this September 2013. Step in, to know discounts on car this month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+