టాటా మోటార్స్ ఫెస్టివల్ ఆఫర్; కార్లపై భారీ తగ్గింపులు
గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుంటంతో, ప్రస్తుత పండుగ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్ల తయారీదారులు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేయటం ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఈ పండుగ సీజన్ నేపథ్యంలో తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది.
ఈ ఆఫర్ అక్టోబర్ 1, 2013వ తేది నుంచి అక్టోబర్ 31, 2013 వరకు అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా, కార్లపై తగ్గింపులను అందించడమే కాకుండా, 3 ఏళ్ల ఇన్సూరెన్స్‌ను కేవలం ఒక్క రూపాయికే కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, 1 గ్రాము అష్షూర్డ్ గోల్డ్ కాయిన్‌ను మరియు ఆకర్షనీయమైన నగదు బహుమతులను అందిస్తోంది. వివిధ కార్లపై టాటా మోటార్స్ అందిస్తున్న ఆఫర్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీ
టాటా మోటార్స్ అందిస్తున్న సుమో గోల్డ్ ఎస్‌యూవీపై రూ.60,500 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ
టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీపై రూ.1,23,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా మాంజా
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ మాంజాపై రూ.1,41,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా విస్టా
టాటా మోటార్స్ అందిస్తున్న కొత్త విస్టా కారుపై రూ.89,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ అందిస్తోంది.

టాటా ఇండికా
కంపెనీ అందిస్తున్న ఇండికా కారుపై రూ.44,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని టాటా మోటార్స్ అందిస్తోంది.

టాటా ఇండిగో ఈసిఎస్
టాటా మోటార్స్ అందిస్తున్న ఇండిగో ఈసిఎస్ రూ.54,000 గరిష్ట నగదు ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

2013 టాటా నానో
కంపెనీ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోలో ప్రవేశపెట్టిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఇప్పుడు అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారుపై కంపెనీ సుమారు రూ.40,000 లకు పైగా నగదు ప్రయోజనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ఫెస్టివ్ ఆఫర్
ఈ ఆఫర్ అక్టోబర్ 1, 2013వ తేది నుంచి అక్టోబర్ 31, 2013 వరకు అమల్లో ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీపంలో అధీకృత టాటా మోటార్స్ డీలరును సంప్రదించండి.
(*షరతులు వర్తిస్తాయి, పూర్తి వివరాల కోసం సమీపంలో అధీకృత టాటా మోటార్స్ డీలరును సంప్రదించండి).


Click it and Unblock the Notifications








