ఫియట్ 500ఎల్ లివింగ్ 7 సీటర్ ఎమ్‌వి విడుదల

By Ravi

ఫియట్ అందిస్తున్న చిన్న కారు 'ఫియట్ 500' మోడల్ మనదేశ మార్కెట్లో అంత సక్సెస్‌ను సాధించలేకపోయింది కానీ, విదేశాల్లో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది. అక్కడి మార్కెట్లలో ఫియట్ తమ 500 సిరీస్‌లో అనేక వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

తాజాగా ఫియట్ తమ 500 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ బహుళ ప్రయోజన వాహనాన్ని (ఎమ్‌పివి) అభివృద్ధి చేసింది. ఫియట్ 500ఎల్ లివింగ్ ఎమ్‌పివిగా పిలిచే ఈ కొత్త 7-సీటర్ వాహనం 2013 చివరి నాటికి యూరప్ మార్కెట్లలో లభ్యం కానుంది.

ఈ నేపథ్యంలో ఫియట్ 500ఎల్ లివింగ్ ఎమ్‌పివికి సంబంధించిన ఫొటోలను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా మోటార్స్ విడిపోయి ఒంటరి ప్రయాణం సాగిస్తున్న ఫియట్ ఇండియా, ఇక్కడి మార్కెట్లో తన సత్తాను నిరూపించుకునేందుకు ఈ కొత్త 500ఎల్ లివింగ్ ఎమ్‌‌పివి దేశీయ విపణిలో కూడా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫియట్ 500ఎల్ లివింగ్ ఎమ్‌పివి రెండు వేరియంట్లలో (పాప్ స్టార్, లాంజ్) లభ్యం కానుంది. ఇది మొత్తం 19 బాడీ కలర్స్ ‌(అందులో 11 డ్యూయెల్ టోన్ కలర్స్), 6 ఇంటీరియర్ కలర్స్, 15 రకాల అల్లాయ్ వీల్స్ అండ్ హబ్ క్యాప్స్ ఆప్షన్లతో కొనుగోలుదారుల ఎంపికను బట్టి అందుబాటులో ఉంటుంది.

ఇది రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ ఇంజన్స్‌లో ఒకటి 95 హార్స్ పవర్ 1.4 లీటర్, 16వి ఇంజన్ మరొకటి 105 హార్స్ పవర్ 0.9 లీటర్ ట్విన్ఎయిర్ టర్బో ఇంజన్. డీజిల్ ఇంజన్స్‌లో ఒకటి 105 హార్స్ పవర్ 1.6 లీటర్, మల్టీ జెట్ 2 ఇంజన్ మరొకటి 85 హార్స్ పవర్ 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్ (ఇవి రెండూ కూడా టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్లే). ఇందులో మ్యాన్యులల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఫియట్ 500ఎల్ లివింగ్ 7 సీటర్ ఎమ్‌వి
ఫియట్ 500ఎల్ లివింగ్ 7 సీటర్ ఎమ్‌వి
ఫియట్ 500ఎల్ లివింగ్ 7 సీటర్ ఎమ్‌వి
ఫియట్ 500ఎల్ లివింగ్ 7 సీటర్ ఎమ్‌వి
ఫియట్ 500ఎల్ లివింగ్ 7 సీటర్ ఎమ్‌వి
ఫియట్ 500ఎల్ లివింగ్ 7 సీటర్ ఎమ్‌వి

More from DriveSpark

Article Published On: Saturday, June 22, 2013, 11:50 [IST]
English summary
Fiat has revealed a new seven seater MPV based on its 500 hatchback. While the 500L is an extended version of the 500, with a seating capacity for 5 adults, the 500L Living, as the new model is called, gains about 8 inches to provide 5 + 2 seating configuration.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+