బెంగుళూరులో ఫియట్ అవెంచురా..
ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫియట్ ఇండియా, ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త కాంటెంపరరీ అర్బన్ వెహికల్ (సియూవి) 'ఫియట్ అవెంచూరా' (Fiat Avventura)ని కంపెనీ తాజాగా బెంగుళూరు మార్కెట్లో కూడా విడుదల చేసింది.
ఫియట్ అవెంచురా సియూవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఐదు వేరియంట్లలో (2 పెట్రోల్, 3 డీజిల్) లభిస్తుంది. భారతీయ పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవెంచురాను డిజైన్ చేశామని ఫియట్ ఇండియా పేర్కొంది.

పెట్రోల్ వెర్షన్ ఫియట్ అవెంచురాలో 1368సీసీ ఫైర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 14.4 కి.మీ. మైలేజీనిస్తుంది.
డీజిల్ వెర్షన్ ఫియట్ అవెంచురాలో 1248సీసీ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 197 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 20.5 కి.మీ. మైలేజీనిస్తుంది.
పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు రెండూ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తాయి, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. మంచి ఆఫ్-రోడర్ లుక్‌ని కలిగి ఉండే అవెంచురాలోఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేకపోవటం ఆఫ్-రోడ్ ప్రియులను నిరుత్సాహానికి గురిచేసే అంశం.

బెంగుళూరు మార్కెట్లో లభ్యం కానున్న వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* ఫియట్ అవెంచురా యాక్టివ్ (పెట్రోల్) - రూ.6.09 లక్షలు
* ఫియట్ అవెంచురా డైనమిక్ (పెట్రోల్) - రూ.7.18 లక్షలు
* ఫియట్ అవెంచురా యాక్టివ్ (డీజిల్) - రూ.7.01 లక్షలు
* ఫియట్ అవెంచురా డైనమిక్ (డీజిల్) - రూ.7.79 లక్షలు
* ఫియట్ అవెంచురా ఎమోషన్ (డీజిల్) - రూ.8.32 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)


Click it and Unblock the Notifications








