60 రోజుల్లో ఫియట్ అవెంచురా క్రాసోవర్ విడుదల

By Ravi

ఇటీవలే సరికొత్త 2014 పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన ఫియట్ ఇండియా, మరో 60 రోజుల తర్వాత వేరొక కొత్త కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఫియట్ ఆవిష్కరించిన తమ సరికొత్త క్రాసోవర్ 'ఫియట్ అవెంచూరా' (Fiat Avventura) అక్టోబర్ 2014 నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో ఇవో విడుదల; ధరలు

వాస్తవానికి ఫియట్ పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్‌కి హైలీ మోడిఫైడ్ వెర్షనే ఈ ఫియట్ అవెంచురా క్రాసోవర్ (టొయోటా ఎతియోస్, ఎతియోస్ క్రాస్ మోడళ్ల మాదిరిగా). ఫియట్ పుంటో ప్లాట్‌ఫామ్‌పై తయారైన క్రాసోవర్ ఇది. రెగ్యులర్ పుంటో ఇవోకు, అవెంచురాకు మధ్య వ్యత్యాసాన్ని చూపించేందుకు గాను ఇందులో అనేక మార్పులు చేర్పులు చేశారు.

Fiat Avventura

ఇందులో ప్రధానంగా, కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, ఫ్లాట్ బానెట్, రివైజ్డ్ ఎయిర్‌డ్యామ్స్, మెటల్ స్కిడ్ గార్డ్, ఫాగ్ ల్యాంప్స్ స్థానంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్ నుంచి వెనుక బంపర్ వరకు వీల్ ఆర్చెస్‌ను కవర్ చేస్తూ చేసిన బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, బ్లాక్ డోర్ గార్డ్స్ మరియు దానిపై ఏర్పాటు చేసిన అవెంచురా బ్రాండింగ్ వంటి ఇందులో చూడొచ్చు.

ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో ఇవో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉండేలా ఫియట్ అవెంచురా గ్రౌండ్ క్లియరెన్స్‌ను పెంచారు. దీని వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఈకోస్పోర్ట్ మాదిరిగా ఉండే బూట్ డోర్ మౌంటెడ్ స్పేర్ వీల్, టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్, స్ప్లిట్ సైలెన్సర్ వంటి డిజైన్ ఫీచర్లున్నాయి. దీని ఇంటీరియర్స్ కూడా మరింత మోడ్రన్‌గా ఉండనున్నాయి. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 6, 2014, 14:34 [IST]
English summary
Fiat India has just launched their Punto Evo at an attractive price. Now the attention turns to its earlier compact SUV, which now looks more like a crossover from its recently launched hatchback. We are talking about the Avventura, that the Italian manufacturer showcased at the 2014 Auto Expo held in New Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+