ఫియట్ అవెంచురా విడుదల; ప్రారంభ ధర రూ.5.99 లక్షలు
ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫియట్ ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంటెంపరరీ అర్బన్ వెహికల్ (సియూవి) 'ఫియట్ అవెంచూరా' (Fiat Avventura)ని కంపెనీ నేడు (అక్టోబర్ 21, 2014) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (బేస్ వేరియంట్, పెట్రోల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర)గా ఉంది.
ఫియట్ అవెంచురా సియూవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఐదు వేరియంట్లలో (2 పెట్రోల్, 3 డీజిల్) లభిస్తుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* ఫియట్ అవెంచురా యాక్టివ్ (పెట్రోల్) - రూ.5.99 లక్షలు
* ఫియట్ అవెంచురా డైనమిక్ (పెట్రోల్) - రూ.7.05 లక్షలు
* ఫియట్ అవెంచురా యాక్టివ్ (డీజిల్) - రూ.6.89 లక్షలు
* ఫియట్ అవెంచురా డైనమిక్ (డీజిల్) - రూ.7.65 లక్షలు
* ఫియట్ అవెంచురా ఎమోషన్ (డీజిల్) - రూ.8.17 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

భారతీయ పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫియట్ అవెంచురాను డిజైన్ చేశారు. పూనేలో ఉన్న రంజన్ గావ్ ప్లాంట్‌లో ఈ మోడల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతానికి భారత మార్కెట్లో మాత్రమే ఈ మోడల్‌ను విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో, ఫియట్ ఇండియా తొలిసారిగా తమ అవెంచూరాను ఆవిష్కరించింది. గడచిన నెల నుంచే ఫియట్ అవెంచురా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత ఫియట్ ఇండియా డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించామని, ఇప్పటి వరకు తాము ఊహించని రీతిలో అవెంచురా కోసం ఎంక్వైరీలు వచ్చాయని కంపెనీ తెలిపింది. ఈ మోడల్‌కు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications