ఫియట్ పండా క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల
ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫియట్ గ్లోబల్ మార్కెట్ల కోసం తమ సరికొత్త 'పండా క్రాస్' మోడల్‌ను విడుదల చేసింది. పాపులర్ పండా 4x4 మోడల్‌ను ఆధారంగా చేసుకొని దీనిని తయారు చేశారు. భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో, ఈ సరికొత్త పండా క్రాస్‌ను కంపెనీ ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చదవండి: కారు కోసం రుణం కాదు, కారుంటేనే రుణం!
ఫియట్ పండా క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.3 లీటర్ మల్టీజెట్ 2 మరియు 0.9 లీటర్ ట్విన్ఎయిర్ టర్బో ఇంజన్ ఆప్షన్లతో ఇది లభిస్తోంది. ఇది ఆఫ్ రోడింగ్ కోసం అలాగే సిటీ కమ్యూటింగ్ కోసం చక్కగా సరిపోతుంది. క్రాలర్ ఫస్ట్ గేర్‌తో కూడిన 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో ఇది మంచి ఆఫ్ రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇందులోని 0.9 లీటర్ ట్విన్ఎయిర్ టర్బో ఇంజన్ గరిష్టంగా 90 హార్స్ పవర్‌ల శక్తిని, 145 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 1.3 లీటర్ మల్టీజెట్ 2 ఇంజన్ గరిష్టంగా 80 హార్స్ పవర్‌ల శక్తిని, 190 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో ఫియట్ పండా క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

రెగ్యులర్ పండా 4x4 మోడల్‌ను ఆధారంగా చేసుకొని పండా క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేశారు. డైమన్షన్స్ పరంగా చూసుకుంటే ఫియట్ పండా క్రాస్ మనదేశంలో లభిస్తున్న ప్రీమియర్ రియో కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్ వలన ఇది సిటీ కమ్యూటింగ్‌కి, ఆఫ్ రోడింగ్‌కు ఎక్కువగా సూట్ అవుతుంది.

పండా క్రాస్ ఫ్రంట్ డిజైన్ చాలా విశిష్టంగా ఉంటుంది, ఇది ఇతర ఆఫ్ రోడర్ల మాదిరిగా కాకుండా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో స్టయిలిష్ బ్రష్డ్ అల్యూమినియం స్కిడ్ ప్లేట్ (ఫ్రంట్ బంపర్ క్రింది భాగంలో) ఉంటుంది. ఈ స్కిడ్ ప్లేట్‌కే డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్లను అమర్చబడి ఉంటాయి. హెడ్‌లైట్స్‌కు కార్నర్‌లో అమర్చబడి ఉండే ఫాగ్ ల్యాంప్స్ ఇందులో మరో ప్రత్యేకత.

రెన్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ మాదిరిగా పండా క్రాస్ బాడీ చుట్టూ సన్నటి ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంటుంది. ఇది ఓవరాల్ లుక్‌ని మరింత పెంచుతుంది. దీని సైడ్స్‌పై ప్లాస్టిక్ క్లాడింగ్‌కు ఎగువన అల్యూమనియం కలర్‌లో మరో క్లాడింగ్ ఉంటుంది, దానిపై క్రాస్ బ్యాడ్జ్ ఉంటుంది. స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, ఆఫ్ రోడర్ టైర్స్ ఇందులో మరో ప్రత్యేకత. ఇంకా స్పోర్టూ రూఫ్ రెయిల్స్ కూడా అట్రాక్టివ్‌గా ఉంటాయి.

పండా క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఫియట్ సింపుల్‌గా ఉంచింది. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ మాదిరిగానే వెనుక వైపు కూడా బంపర్ క్రింది భాగంలో ఓ స్కిడ్ ప్లేట్ ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్‌లో అసిస్ట్ చేసేందుకు ఉపయోగపడే లైట్లను కూడా ఈ స్కిడ్ ప్లేట్‌కే అమర్చారు. మూడు ఇండివిడ్యువల్ పార్ట్స్‌గా ఎత్తులో అమర్చిన రియర్ లైట్స్ ఇందులో మరో ప్రత్యేక ఆకర్షణ. ఫ్లాట్ ఒవెల్ డిజైన్‌లో ఉండే సైలెన్సర్‌ను ఇందులో గమనించవచ్చు.

ఫియట్ పండా క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ థీమ్‌తో డిజైన్ చేశారు. దీని స్టీరింగ్ వీల్ డిజైన్ విశిష్టంగా ఉంటుంది. త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్ బటన్స్, సెంటర్‌లో ఏర్పాటు చేసిన హారన్ స్విచ్, సైడ్స్ వెరైటీగా డిజైన్ చేసిన ఏసి వెంట్స్, డ్యాష్‌బోర్డుపై ఇతర కంట్రోల్స్, ఆడియో సిస్టమ్, నావిగేషన్‌లను ఇందులో చూడొచ్చు. ప్యాసింజర్ సైడ్ డ్యాష్‌బోర్డ్ క్లీన్‌గా ఉంటుంది. మొత్తమ్మీద క్యాబిన్‌లో ప్రీమియం అప్పీల్‌నిచ్చేలా దీని ఇంటీరియర్స్ డిజైన్ చేశారు.

మొత్తమ్మీద చూసుకుంటే ఫియట్ పండా క్రాస్ ఓ మంచి ఎస్‌యూవీ అని చెప్పొచ్చు. ఇలాంటి కాంపాక్ట్ వాహనాలకు ఇండియాలో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది ఇండియాలో విడుదలైతే ఈకోస్పోర్ట్, డస్టర్ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఫియట్ ఈ మోడల్‌ను ఇండియాకు తీసుకువస్తుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








