పాత ధరకే కొత్త ఫియట్ లీనియా, పుంటో స్పెషల్ ఎడిషన్స్
సాధారణంగా సంవత్సరం చివర్లో ఏ కార్ కంపెనీ అయినా తమ అమ్మకాల టార్గెట్‌ను చేరుకునేందుకు, వాహనాల స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు, స్కీమ్‌లను అందిస్తుంటాయి. తాజాగా.. ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా, తమ లీనియా సెడాన్ మరియు పుంటో హ్యాచ్‌బ్యాక్ కార్లపై ఓ కొత్త ప్యాకేజీని ఆఫర్ చేస్తుంది.
ఫియట్ లీనియా ఆబ్సల్యూట్ ఎడిషన్, ఫియట్ పుంటో ఆబ్సల్యూట్ ఎడిషన్ల పేరిట కంపెనీ రెండు కొత్త వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ఈ రెండు వేరియంట్లు రెగ్యులర్ వెర్షన్ ధరకే, అదనపు ఫీచర్లతో లభ్యం కానున్నాయి. ఈ రెండు మోడళ్లపై కంపెనీ రూ.25,000 విలువైన యాక్ససరీలను ఫియట్ ఇండియా అందిస్తోంది.

ఫియట్ అందిస్తున్న ఈ ఫీచర్లలో.. టచ్‌స్క్రీన్ జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ (స్మార్ట్‌ఫోన్ ఫంక్షనాలిటీతో కూడిన 3జి టాబ్లెట్ 1.0 గిగా హెట్జ్ ప్రాసెససర్, ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది), రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, వెలుపలి వైపు 'అబ్సల్యూట్' బ్యాడ్జ్, స్ప్లాష్ గార్డ్స్, లీనియా, పుంటో బ్రాండెడ్ డోర్ సిల్ ప్లేట్స్, బీజ్ కార్పెట్స్, లీనియా బూట్ డోర్‌పై క్రోమ్ స్ట్రిప్, పుంటోలో ప్రీమియం ఫ్లోర్ మ్యాట్లు ఉన్నాయి.
ఈ యాక్ససరీ ప్యాక్‌కు అదనంగా ఫియట్ తమ ఆబ్సల్యూట్ ఎడిషన్ ప్యాకేజ్‌లో భాగంగా, ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు లీనియాపై రూ.70,000 విలువైన ఎక్సేంజ్ ఆఫర్ అలాగే పుంటోపై రూ.60,000 విలువైన ఎక్సేంజ్ ఆఫర్ బెనిఫిట్లను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ ఆబ్సల్యూట్ ఎడిషన్ ఫియట్ లీనియా, పుంటో కార్లలో ఎలాంటి యాంత్రికపరమైన మార్పులు లేవు.
ఇదివరకే ఫియట్ పుంటో, లీనియా కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా ఈ ప్యాకేజ్‌ను తమ కార్ల కోసం కొనుగోలు చేయవచ్చు. ఈ ప్యాకేజ్ ఖరీదు రూ.25,000. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని అధీకృత ఫియట్ ఇండియా డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








