ఫియట్ లీనియా క్లాసిక్ విడుదల; ధర రూ.5.99 లక్షలు

By Ravi

ఇదివరకటి కథనంలో చెప్పుకున్నట్లుగానే, ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా నేడు (సెప్టెంబర్ 25, 2013) భారత మార్కెట్లో ఓ చవక సెడాన్ 'ఫియట్ లీనియా క్లాసిక్' (Fiat Linea Classic)ను విడుదల చేసింది. దేశీయ విణిలో దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఫియట్ లీనియా 1.4 లీటర్ పెట్రోల్ క్లాసిక్ - రూ. 5.99 లక్షలు
  • ఫియట్ లీనియా 1.3 లీటర్ డీజిల్ క్లాసిక్ - రూ. 6.95 లక్షలు
  • ఫియట్ లీనియా 1.3 లీటర్ డీజిల్ క్లాసిక్ ప్లస్ - రూ.7.50 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Fiat Linea Classic

పెట్రోల్ వెర్షన్ 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్‌లో 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో పవర్ స్టీరింగ్, స్పీడ్ లిమిట్ బజర్, డ్యూయెల్ పారాబోలా హెడ్‌ల్యాంప్స్, ఫైర్ ప్రివెన్షన్ సిస్టమ్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి.

అలాగె రెగ్యులర్ లీనియా సెడాన్‌లో లభించే 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్లైమేట్ కంట్రోల్, రియర్ పవర్ విండోస్ వంటి ఫీచర్లను ఈ కొత్త ఫియట్ లీనియా క్లాసిక్ సెడాన్‌లో తొలగించారు. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా అమేజ్, మారుతి స్విఫ్ట్ డిజైర్, టొయోటా ఎతియోస్, చెవర్లే సెయిల్ సెడాన్ వంటి మోడళ్లకు ధీటుగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 25, 2013, 15:54 [IST]
English summary
Fiat India has just launched the Linea Classic, a price cut version of Linea at Rs 5.99 Lakhs (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+