ఇండియా నుంచి ఎగుమతి కానున్న 'ఫియట్ అవెంచురా'
గడచిన ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ మొట్టమొదటి సారిగా తమ సరికొత్త క్రాసోవర్ కాన్సెప్ట్ 'ఫియట్ అవెంచూరా' (Fiat Avventura)ను ఆవిష్కరించిన సంగతి తెలిసనదే. కాగా.. ఫియట్ ఇండియా ఇప్పుడు ఈ అవెంచురా క్రాసోవర్ భారత మార్కెట్లో ఉత్పత్తి చేసి, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది.
ఇందుకు ప్రధాన కారణం, ఫియట్ అవెంచురాను భారత్‌లో ఉత్పత్తి చేయటం వలన తక్కువ ఖర్చుతోనే దీనిని తయారు చేయటం సాధ్యమవుతుంది. అనేక అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు మన దేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి ఆసక్తి చూపుతుండటానికి కారణం.. ఇక్కడ కార్మికులు చవకగా దొరకటం, మన దేశంలోని పాలసీలు, ప్రోత్సాహకాలు కూడా ఆకర్షనీయంగా ఉండటమే.

ఫియట్ కూడా ఈ అంశాలను క్యాష్ చేసుకునేందుకు తమ అవెంచురా క్రాసోవర్‌ను ఇక్కడే ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకుంది. ఫియట్ అవెంచురా తొలుతగా భారత మార్కెట్లో విడుదల కానుంది, అనంతరం ఇది గ్లోబల్ మార్కెట్లకు వెళ్లనుంది. అవెంచురా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండేలా కంపెనీ చర్యలు తీసుకోనుంది.
ఫియట్ అవెంచురా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదొక అత్యధికంగా మోడిఫై చేయబడిన పుంటో హ్యాచ్‌బ్యాక్ అనొచ్చు. ఫియట్ పుంటో ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ క్రాసోవర్.. కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, ఫ్లాట్ బానెట్, రివైజ్డ్ ఎయిర్‌డ్యామ్స్, మెటల్ స్కిడ్ గార్డ్ వంటి ఫీచర్లతో సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉండేలా ఈ కాన్సెప్ట్ కారు గ్రౌండ్ క్లియరెన్స్‌ను పెంచారు.

ఫియట్ అవెంచురా వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఈకోస్పోర్ట్ మాదిరిగా ఉండే బూట్ డోర్ మౌంటెడ్ స్పేర్ వీల్, టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్, స్ప్లిట్ సైలెన్సర్ వంటి డిజైన్ ఫీచర్లు చూపరులను ఆకట్టుకుంటాయి. ఫియట్ అవెంచురా సరికొత్త మోడ్రన్ ఇంటీరియర్ స్టైల్‌ను కలిగి ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








