ఆగస్ట్ 5న ఫియట్ పుంటో ఇవో విడుదల

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను మరికొద్ది రోజుల్లోనే ప్రవేశపెట్టనుంది. 'ఫియట్ పుంటో ఇవో' (Fiat Punto Evo) పేరిట అప్‌గ్రేడెడ్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను ఫియట్ ఇండియా ఆగస్ట్ 5, 2014వ తేదీన దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

ఇది కూడా చదవండి: ఆగస్ట్ 15న కొత్త 2014 హ్యుందాయ్ ఐ20 విడుదల

కొత్త 2014 ఫియట్ పుంటో ఇవో రిఫ్రెష్డ్ డిజైన్‌తో పాటుగా ప్రీమియం ఇంటీరియర్స్, మోడ్రన్ ఫీచర్లతో లభ్యం కానుంది. అయితే, ఈ కొత్త మోడల్ పుంటోలో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇదివరకటి పుంటో కారులో ఉపయోగించిన 1.3 లీటర్ డీజిల్, 1.4 లీటర్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లతోనే ఇది లభ్యం కానుంది.


డీజిల్ ఇంజన్ ఇదివరకటి మాదిరిగానే రెండు విభిన్న ట్యూనింగ్ ఆప్షన్లతో (76 పిఎస్, 90 హార్స్ పవర్) లభిస్తుంది. కాగా.. 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ కేవలం ఎమోషన్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.

కొత్త ఫియట్ పుంటో ఇవోకు ప్రీమియం లుక్‌నిచ్చేందుకు గాను ఇందులో మరింత ఎక్కువ క్రోమ్‌ను జోడించారు. మెరుగైన రోడ్ విజిబిలిటీ కోసం రైడ్ హైట్‌ను కూడా పెంచారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా పెంచారు.

Fiat To Launch Punto Evo On 5th August

కొత్త ఫియట్ పుంటో ఇవో బ్లాక్ విత్ వైట్ సాఫ్ట్ టచ్ స్పోర్టీ లుకింగ్ ఇంటీరియర్‌తో లభ్యం కానుంది. కాగా 90 హెచ్‌పి మోడల్ మాత్రం కేవలం ఆల్ బ్లాక్ ఇంటీరియర్‌తో లభిస్తుంది. ఈ వేరియంట్లో క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో లభ్యం కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

ఈ వీడియో చూశారా..
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ZAmq0sxLEDM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, July 30, 2014, 11:10 [IST]
English summary
Fiat India is committed to introducing and strengthening its product portfolio in the Indian market. The Italian manufacturers plan was to introduce new vehicles along with refreshed variants of their current lineup. They will be now launching the refreshed version of its Punto hatchback.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+