2014 కరోలా సెడాన్‌ను ఆవిష్కరించిన టొయోటా

By Ravi

తమ తర్వాతి తరం కరోలా సెడాన్‌కు సంబంధించి గడచిన కొద్ది రోజులగా వివిధ టీజర్ ఫొటోలతో కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన జపాన్ ఆటో దిగ్గజం టొయోటా చివరికి తమ 2014 టొయోటా కరోలాను ఆవిష్కరించింది. ఈ కారు ఆవిష్కరణకు, కరోలాకు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాను కంపెనీ వేదికగా ఎంచుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో టొయోటా తమ అధునాత కరోలా సెడాన్‌ను ఆవిష్కరించింది.

మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, 2014 టొయోటా కరోలా సెడాన్‌ను కంపెనీ గడచిన జనవరిలో జరిగిన డెట్రాయిట్ మోటార్ షోలో ఆవిష్కరించిన టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. ప్రత్యేకించి స్టయిల్ అంటే ఇష్టపడే యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది. ఈ అధునాత టొయెటా కరోలాను భారత్‍‌లో పొందాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే మరి.

అమెరికా మార్కెట్లలో టొయోటా రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది. అందులో ఒకటి 132 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్, మరొకటి 140 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్. ఈ కారులో కొత్తగా పెట్రోల్ వెర్షన్‌లో 7-స్పీడ్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ట్రాన్సిమిషన్‌ను జోడించారు. దీని వలన ఇది మెరుగైన మైలేజీని ఆఫర్ చేయనుంది.

అమెరికా మార్కెట్లో లభ్యం కానున్న కొత్త టొయోటా కరోలా సెడాన్‌లో అన్ని వేరియంట్లలో ఎల్‌ఈడి హెడ్‌లైట్స్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ సస్టాండర్డ్‌గా లభిస్తాయి. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్ డిజైన్

కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్ డిజైన్

జనవరిలో జరిగిన 2013 డెట్రాయిట్ మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించిన కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్ కారు డిజైన్ క్యూలను ఈ 2014 టొయోటా కరోలా సెడాన్‌లో స్పష్టంగా గమనించవచ్చు.

ఫ్రంట్ ప్రొఫైల్

ఫ్రంట్ ప్రొఫైల్

ఫ్రంట్ గ్రిల్‌తో కలిసిపోయినట్లుగా ఉండే సన్నటి హెడ్ లైట్స్, సరికొత్త బ్యాడ్జ్‌తో ఇది మంచి బోల్డ్ లుక్‌ను కలిగి ఉంటుంది.

బాడీ లైన్స్

బాడీ లైన్స్

మంచి స్పోర్టీ లుక్‌నిచ్చేలా ఈ కారు బాడీ లైన్స్ డిజైన్ చేశారు.

షోల్డర్ లైన్స్

షోల్డర్ లైన్స్

కారు బాడీ మొత్తం షోల్డర్ కనిపించేలా డిజైన్ చేశారు.

టెయిల్ ల్యాంప్స్

టెయిల్ ల్యాంప్స్

ఆకర్షనీయమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్.

రియర్ ప్రొఫైల్

రియర్ ప్రొఫైల్

వెనుక నుంచి కూడా స్టయిలిష్, స్పోర్టీగా కనిపించేలా ఈ కారును డిజైన్ చేశారు.

వీల్ బేస్

వీల్ బేస్

ఈ 2014 టొయోటా కరోలా వీల్ బేస్‌ను మునపటి వెర్షన్‌తో పోల్చుకుంటే 100 మి.మీ. పెంచారు. దీంతో మొత్తం పొడవు 4639 మి.మీ. పెరిగింది.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా సరికొత్త మ్యూజిక్ సిస్టమ్, పవర్‌ఫుల్ ఏసి, స్టయిలిష్ డ్యాష్‌బోర్డ వంటి ఫీచర్లతో దీని ఇంటీరియర్స్‍‌‌ను అప్‌గ్రేడ్ చేశారు.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

డ్రైవర్‌కు కావల్సిన అన్ని సమాచారాలను అందించడంతో పాటుగా, వినోదాన్ని కూడా పంచే అధునాత టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్.

అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్

ఈ కారుకు అమర్చిన స్టయిలిష్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి.

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా

నెక్స్ట్ జనరేషన్ టొయోటా కరోలా

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2013, 16:17 [IST]
English summary
The all new 2014 Toyota Corolla has been revealed in the U.S., the sedan's largest market. The new Corolla, based on the Furia concept car showcased in January in Detroit, is sporty and muscular, clearly targeted at a younger age group of buyers. The new Toyota Corolla, sold as the Corolla Altis in India, will be launched here in early 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+