గుర్ఖాతో ఆఫ్-రోడ్ మార్కెట్‌ను దున్నేస్తాం: ఫోర్స్ మోటార్స్

By Ravi

పూనేకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వచ్చే నెలలో (సెప్టెంబర్ 2014లో) విడుదల చేయనున్న తమ సరికొత్త 2014 'ఫోర్స్ గుర్ఖా' (Force Gurkha) ఎస్‌యూవీతో భారత ఆఫ్-రోడ్ వాహనాల విభాగంలో 20 శాతం మార్కెట్ వాటా దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ మోడల్‌ను విడుదల చేసిన తర్వాత ప్రతినెలా 2,400 యూనిట్ల ఫోర్స్ గుర్ఖాలను విక్రయించాలని భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

వాస్తవానికి ఫోర్స్ మోటార్స్ గడచిన సంవత్సరం ఫిబ్రవరిలోనే తమ సరికొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ విడుదల గురించి కంపెనీ ప్రకటన చేసినప్పటికీ, ఇది కస్టమర్ల చెంతకు చేరేందుకు దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం పట్టింది. ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్‌ను ఫోర్స్ మోటార్స్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయటాన్ని కూడా ప్రారంభించింది.

ఫోర్స్ గుర్ఖా విషయంలో నిపుణలు, ఇదివరకటి కస్టమర్లు ఇచ్చి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ ఇందులో కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేసింది. ఇదివరకటి ఫోర్స్ గుర్ఖాతో పోల్చుకుంటే పెర్ఫామెన్స్, డిజైన్‌ల పరంగా మరింత మెరుగ్గా ఉండేలా ఫోర్స్ మోటార్స్ తమ సరికొత్త 2014 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్

కొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్ నుంచి గ్రహించిన పవర్‌ఫుల్ 2.6 లీటర్ ఓఎమ్616 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 81 బిహెచ్‌పిల శక్తిని, 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్

రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, కొత్త గ్రిల్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ లుక్‌‌ను కలిగి ఉంటుంది. ఫోర్స్ గుర్ఖా ప్రస్తుతానికి బిఎస్-3 మరియు బిఎస్-4 వెర్షన్‌‌లలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్

ఫోర్స్ మోటార్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫోర్స్ గుర్ఖా మొత్తం మూడు వేరియంట్లలో లభ్యం కానుంది.

ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్

ఈ మూడు వేరియంట్లలో ఒకటి ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్‌తో కూడిన 5-సీటర్ వేరియంట్ కాగా రెండు సాఫ్ట్ టాప్‌తో కూడిన 6-సీటర్ వేరియంట్స్ (వీటిల్లో ఒకటి టూ-వీల్ డ్రైవ్ మరొకటి 4-వీల్ డ్రైవ్).

ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్

ఫోర్స్ గుర్ఖా ఈ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఆఫ్-రోడర్ 'థార్' ఎస్‌యూవీతో తలపడనుంది.

ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్

గడచిన ఫిబ్రవరిలో ఫోర్స్ మోటార్స్ వెల్లడించిన దాని ప్రకారం, గుర్ఖా ధరలు ఇలా ఉన్నాయి (ధరలను తర్వాతి స్లైడ్‌లో పరిశీలించండి). అయితే, సెప్టెంబర్ 2014లో కంపెనీ విడుదల చేయనున్న గుర్ఖాకు ఇదే ధరలను వర్తింప జేస్తుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్

* ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్ - రూ.8.50 లక్షలు

* ఫోర్-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.8.35 లక్షలు

* టూ-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.6.25 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2014, 15:45 [IST]
English summary
Force Motors is eyeing 20 per cent market share in the niche off-road vehicle segment as it aims to sell around 2,400 units of its soon to be introduced off-road vehicle Gurkha in the first year of launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+