గుర్ఖా ఎస్‌యూవీని విడుదల చేసిన ఫోర్స్ మోటార్స్

By Ravi

ఆఫ్-రోడ్ వాహన ప్రియులకు 'ఫోర్స్ గుర్ఖా' ఎస్‌యూవీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెంపో ట్రావెలర్, ట్రాక్స్ వంటి ప్యాసింజర్ కమర్షియల్ వాహనాలను తయారు చేసే ఫోర్స్ మోటార్స్ గతంలో అందించిన అత్యంత పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ 'గుర్ఖా'ను భారత మార్కెట్లో పునఃప్రవేశపెట్టింది. పురాతన ఫోర్స్ గుర్ఖాతో పోల్చుకుంటే పెర్ఫామెన్స్, డిజైన్‌ల పరంగా మరింత మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దిన సరికొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీని ఫోర్స్ మోటార్స్ తాజాగా దేశీయ విపణిలో విడుదల చేసింది.

ఫోర్స్ మోటార్స్ విడుదల చేసిన ఈ సరికొత్త గుర్ఖా ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ నుంచి గ్రహించిన పవర్‌ఫుల్ 2.6 లీటర్ ఓఎమ్616 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 81 బిహెచ్‌పిల శక్తిని, 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, కొత్త గ్రిల్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ లుక్‌‌ను కలిగి ఉంటుంది. ఫోర్స్ గుర్ఖా ప్రస్తుతానికి బిఎస్-3 వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, బిఎస్-4 వెర్షన్‌ త్వరలో విడుదల కావచ్చని అంచనా.

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

గుర్ఖా ఎస్‌యూవీని విడుదల చేస్తున్న ఫోర్స్ మోటార్స్ అధికారులు.

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ - సాఫ్ట్ టాప్ వెర్షన్, 6-సీటర్, 4-వీల్ డ్రైవ్

ధర - రూ.8.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ - హార్డ్ టాప్ వెర్షన్, 5-సీటర్, 4-వీల్ డ్రైవ్

ధర - రూ.8.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ - సాఫ్ట్ టాప్ వెర్షన్, 6-సీటర్, 2-వీల్ డ్రైవ్

ధర - రూ.6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ


ఫోర్స్ గుర్ఖా మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. అందులో ఒకటి ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్‌తో కూడిన 5-సీటర్ వేరియంట్ కాగా రెండు సాఫ్ట్ టాప్‌తో కూడిన 6-సీటర్ వేరియంట్స్ (వీటిల్లో ఒకటి టూ-వీల్ డ్రైవ్ మరొకటి 4-వీల్ డ్రైవ్). ఈ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఆఫ్-రోడర్ 'థార్' ఎస్‌యూవీతో ఇది తలపడనుంది. భారత మార్కెట్లో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* ఫోర్స్ గుర్ఖా ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్ - రూ.8.50 లక్షలు
* ఫోర్స్ గుర్ఖా ఫోర్-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.8.35 లక్షలు
* ఫోర్స్ గుర్ఖా టూ-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.6.25 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Monday, February 25, 2013, 15:56 [IST]
English summary
Force Motors, the Indian light commercial vehicle manufacturer who also sells the Force One SUV, has another SUV to its line-up after it launched the new Gurkha. The Force Gurkha has been launched with a starting price of INR 6.25 lakhs. The Force Gurkha will be available with a hard top roof version and two variants will be soft top versions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+