ఫోర్డ్ నుంచి అధునాతన లైట్‌వెయిట్ కాన్సెప్ట్ కారు
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ తాజాగా ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును తయారు చేసింది. భవిష్యత్తు కోసం ధృడమైన మరియు తేలికైన వాహనాలను రూపొందించే దిశలో భాగంగా ఫోర్డ్ తమ ఫ్యూజన్ కారును ఆధారంగా చేసుకొని, అందులో ఓ లైట్‌వెయిట్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది. ఫోర్డ్ తమ అధునాతన ఎఫ్-150 పికప్ ట్రక్కులో ఉపయోగించిన టెక్నాలజీనే ఈ కాన్సెప్ట్‌లోను ఉపయోగించింది.
ఫోర్డ్ ఎఫ్-150 పికప్ ట్రక్ ఒకప్పుడు భారీ బరువును కలిగి ఉండేది. అయితే, ప్రస్తుత అధునాత పికప్ ట్రక్కులో ఛాస్సిస్ నుంచి బాడీ వరకు ధృడమైన, తేలికైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా దాని బరువును పాత మోడల్‌తో సుమారు 700 పౌండ్ల వరకు తగ్గించగలిగింది. ఇదే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఫోర్డ్ ఫ్యూజన్ (కొత్త ఫియస్టా) కాన్సెప్ట్‌లో కూడా బరువును తగ్గించే ప్రయత్నం చేశారు.

కొత్త ఫోర్డ్ ఫ్యూజన్ కారులో లైట్ వెయిట్ మెటీరియల్స్‌ను ఉపయోగించి ప్రస్తుతం ఫ్యూజన్‌తో పోల్చుకుంటే సుమారు 800 పౌండ్ల బరువు తక్కువగా ఉండేలా ఈ కాన్సెప్ట్ కారును తయారు చేశారు. కారు బరువును తగ్గించడం వలన అధిక మైలేజీని పొందవచ్చని ఫోర్డ్ పేర్కొంది. ఈ కారు బరువును తగ్గించినప్పటికీ, ధృడత్వం విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, అధునాత లైట్ వెయిట్ మెటీరియల్స్‌తో ఇది సాధ్యమవుతుందని ఫోర్డ్ తెలిపింది. ఫోర్డ్ తమ కాన్సెప్ట్ గురించి ఏం చెబుతుందో ఈ వీడియోలో మీరే చూడండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/fqFgj6zfHso" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








