మరోసారి ఫోర్డ్ క్లాసిక్ ధరలో కోత; ప్రస్తుత ధర రూ.4.88 లక్షలు

By Ravi

ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'ఫోర్డ్ క్లాసిక్' సెడాన్ ధరను గడచిన జనవరి నెలలో వేరియంట్‌ను బట్టి రూ.70,000 నుంచి రూ.1,00,000 వరకు తగ్గించిన సంగతి తెలిసినదే. దాంతో అప్పట్లో ఫోర్డ్ క్లాసిక్ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండేది.

ఇది కూడా చదవండి: ఫోర్డ్ క్లాసిక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు, రివ్యూ

కాగా.. తాజాగ్ ఫోర్డ్ ఇండియా మరోసారి తమ క్లాసిక్ సెడాన్ ధరను తగ్గించింది. ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లో అమ్మకాలను పెంచుకునేందుకు గాను కంపెనీ నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపు తర్వాత ఫోర్డ్ క్లాసిక్ ప్రారంభ ధర రూ.4.88 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) దిగొచ్చింది. మారుతి స్విఫ్ట్, హోండా అమేజ్‌లకు పోటీ ఇచ్చేందుకు ఫోర్డ్ తమ క్లాసిక్ ధరను తగ్గించినట్లు తెలుస్తోంది.


ఫోర్డ్ క్లాసిక్ ఇంజన్ ఆప్షన్స్:
ఫోర్డ్ ఇండియా గడచిన 2012 మధ్య భాగంలో పాత ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌ను ఫోర్డ్ క్లాసిక్‌గా పేరు మార్చి, ధరను తగ్గించి విడుదల చేసింది. డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్‌లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్‌లో 1.6 లీటర్ డ్యూరాటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 101 పిఎస్‌ల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి.

ఫోర్డ్ క్లాసిక్ మైలేజ్:
డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ లీటర్ డీజిల్‌కు 19.68 కి.మీ. మైలేజీని మరియు పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ లీటర్ పెట్రోల్‌కు 14.09 కి.మీ. మైలేజీస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) కంపెనీ పేర్కొంది.

Ford Classic

ఫోర్డ్ క్లాసిక్ ఫీచర్స్:
ఫోర్డ్ క్లాసిక్‌ టాప్-ఎండ్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్టీరియో సిస్టమ్, వేగాన్ని బట్టి సౌండ్ తగ్గిపోయేలా ఏర్పాటు చేసిన స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్, డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌‌గా లాక్ అయ్యే డ్రైవ్-అవే లాక్స్, బీజ్ ఇంటిరీయర్ ట్రిమ్, సరికొత్త అల్లాయ్ వీల్ డిజైన్, బాడీ కలర్‌లో ఉండే సైడ్ మిర్రర్స్, బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ ఫీచర్లతో లభిస్తుంది.

ఫోర్డ్ క్లాసిక్ కలర్స్:
ఫోర్డ్ క్లాసిక్ సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (పాప్రికా రెడ్, పాంథర్ బ్లాక్, డైమండ్ వైట్, చిల్ మెటాలిక్, మూన్ డస్ట్ సిల్వర్, సీ గ్రే) లభిస్తుంది.

ఫోర్డ్ క్లాసిక్ వేరియంట్లు, ధరలు:
* క్లాసిక్ 1.6 డ్యూరాటెక్ ఎల్ఎక్స్ఐ - రూ. 4.88 లక్షలు
* క్లాసిక్ 1.6 డ్యూరాటెక్ సిఎల్ఎక్స్ఐ - రూ. 5.56 లక్షలు
* క్లాసిక్ 1.6 డ్యూరాటెక్ టైటానియం - రూ. 6.34 లక్షలు
* క్లాసిక్ 1.4 టిడిసిఐ ఎల్ఎక్స్ఐ - రూ. 6.18 లక్షలు
* క్లాసిక్ 1.4 టిడిసిఐ సిఎల్ఎక్స్ఐ - రూ. 6.65 లక్షలు
* క్లాసిక్ 1.4 టిడిసిఐ టైటానియం - రూ. 7.34 లక్షలు

More from DriveSpark

Article Published On: Thursday, May 8, 2014, 12:17 [IST]
English summary
Ford has dropped the price of its Classic sedan model once again. The full sized sedan is now has a starting price of INR 4.88 lakh before Taxes in Delhi. That slots it in the same price range as new sub-4 meter compact sedans.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+