ఫోర్డ్ దీవాళి రిటర్న్స్ ఆఫర్, కార్లపై భారీ తగ్గింపులు
సాధారణంగా ఇయర్ ఎండ్ వస్తుందంటే, కార్ కంపెనీ తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే పలు వాహన తయారీ కంపెనీలు తమ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా.. అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా, 'దీవాళి రిటర్న్స్' అంటూ ఓ కొత్త క్యాంపైన్‌ను ప్రారంభించి, కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఫోర్డ్ దీవాళి రిటర్న్స్ క్యాంపైన్ డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా ఫోర్డ్ కారును కొనుగోలు చేసిన కస్టమర్లకు కంపెనీ ఆకర్షనీయమైన డిస్కౌంట్లను, ఆఫర్లను మరియు బహుమతులను అందించనుంది.
ఫోర్డ్ ఫిగో, క్లాసిక్, ఫియస్టా, ఈకోస్పోర్ట్, ఎండీవర్ మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

ఫోర్డ్ దీవాళి రిటర్న్స్ ఆఫర్స్ డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఏయే కార్లపై కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయో తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

ఫోర్డ్ ఫిగో - రూ.77,000 స్పెషల్ ఆఫర్
ఫోర్డ్ విక్రయిస్తున్న చిన్న కారు ఫిగోపై కంపెనీ రూ.77,000 విలువైన స్పెషల్ ఆఫర్‌ని అందిస్తోంది.

ఫోర్డ్ క్లాసిక్ - రూ.75,000 స్పెషల్ ఆఫర్
ఫోర్డ్ విక్రయిస్తున్న క్లాసిక్ సెడాన్‌పై కంపెనీ రూ.75,000 విలువైన స్పెషల్ ఆఫర్‌ని అందిస్తోంది.

ఫోర్డ్ ఫియస్టా - రూ.54,000 స్పెషల్ ఆఫర్
ఫోర్డ్ విక్రయిస్తున్న ఫియస్టా సెడాన్‌పై కంపెనీ రూ.54,000 విలువైన స్పెషల్ ఆఫర్‌ని అందిస్తోంది.

ఫోర్డ్ ఎండీవర్ - రూ.1.5 లక్షల స్పెషల్ ఆఫర్
ఫోర్డ్ విక్రయిస్తున్న ఎండీవర్ ఎస్‌యూవీపై కంపెనీ రూ.1,50,000 విలువైన స్పెషల్ ఆఫర్‌ని అందిస్తోంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ - రూ.9,999 ఈఎమ్ఐ
ఫోర్డ్ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ ఈకోస్పోర్ట్‌ను ఆకర్షనీయమైన ఫైనాన్స్ స్కీమ్ ద్వారా విక్రయిస్తోంది. కేవలం రూ.9,999 ఈఎమ్ఐకే కస్టమర్లు ఈ కారును సొంతం చేసుకోవచ్చు.

వీటితో పాటుగా యాక్ససరీలపై 50 శాతం డిస్కౌంట్, అశ్శూర్డ్ గిఫ్ట్స్‌ని కూడా ఫోర్డ్ అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని ఫోర్డ్ ఇండియా అధీకృత డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








