అప్పుడే 20 లక్షల మార్కును తాకిన ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్ ఉత్పత్తి
అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ రూపొందించిన అధునాతన పెట్రోల్ ఇంజన్ 'ఫోర్డ్ ఈకోబూస్ట్' అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. ఫోర్డ్ తయారు చేసిన 1.0 లీటర్ ఈకోబూట్స్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చిన కార్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా, ఈ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, సాటిలేని పెర్ఫామెన్స్‌నను, తిరుగులేని మైలేజ్‌ను ఆఫర్ చేస్తుండటమే.
ఫోర్డ్ తమ ఈకోబూస్ట్ ఇంజన్ ఉత్పత్తిని ప్రారంభించిన కొద్ది కాలంలో ఇది 20 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. ప్రస్తుతం ఫోర్డ్ భారత మార్కెట్లో అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా (టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే) ఈ 1.0లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇటీవలే ఈ ఇంజన్ 2013 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ ఇంజన్ ఆప్ ది ఇయర్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
అతి తక్కువ సమయంలో ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్ అత్యంత ప్రాచుర్యాన్ని పొందటానికి గల కారణాలు ఏమిటి? పరిశీలిద్దాం రండి..!

పెర్ఫామెన్స్
ఫోర్డ్ ఈకోబూస్ట్ 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 123 హార్స్ పవర్‌ల శక్తిని, 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పోల్చుకుంటే ఈ పెర్ఫామెన్స్ అనేక రెట్లు అధికం.

లైట్ వెయిట్, కాంపాక్ట్ డిజైన్
ఫోర్డ్ ఈకోబూస్ట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉండి, తేలిక బరువును కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది కారులో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించదు మరియు దీని తేలికపాటి నిర్మాణం వలన ఇది వాహన బరువను తగ్గించడంలో ఉపయోగపడి, మైలేజ్ పెరిగేందుకు దోహదపడుతుంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
ఫోర్డ్ ఇటీవల విడుదల చేసిన ఈకోస్పోర్ట్‌లో కూడా ఈ 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

మైలేజ్
పోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఈ 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ గరిష్టంగా లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దేశీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే, ఇది బెస్ట్ మైలేజ్ అని చెప్పొచ్చు.

ఎకో ఫ్రెండ్లీ ఇంజన్
ఫోర్డ్ ఈకోబూస్ట్ 1.0 లీటర్ ఇంజన్ ఇటు కస్టమర్లకు మేలు చేకూర్చడమే కాకుండా, అటు పర్యావరణానికి కూడా పెద్దగా హాని కలిగించదు. సాధారణ పెట్రోల్ కార్లలో ఉపయోగించే ఇంజన్లతో పోల్చుకుంటే, ఈకోబూస్ట్ ఇంజన్ అతి తక్కువ మోతాదులో కర్భన ఉద్ఘారాలను విడుదల చేస్తుంది. అందుకే ఈ ఇంజన్ అత్యంత పాపులర్ అయ్యింది.

మరిన్ని పవర్‌ఫుల్ ఈకోబూస్ట్ ఇంజన్స్
ఫోర్డ్ కేవలం 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌నే కాకుండా, దీని కన్నా మరింత ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజన్లను కూడా తయారు చేస్తుంది. అందులో 1.5 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్, 1.6 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్, 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ (ఫోర్డ్ ఎస్కేప్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్నారు) మరియు 3.2 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ (ఫోర్డ్ ఎప్-150 పికప్ ట్రక్కు కోసం)లు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ ప్లాన్స్
మరోవైపు జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈకోబూస్ట్ లాంటిదే ఓ 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్, టైగమ్ మోడళ్లలో ఈ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 175 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








