2014 సావ్ పాల్ ఆటో షో: 3 కొత్త అవతారాల్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ అందిస్తున్న పాపులర్ గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈకోస్పోర్ట్ ఇప్పుడు మూడు కొత్త అవతారాల్లో కనిపించనుంది. బ్రెజిల్‌లో జరుగుతున్న 2014 సావ్ పాలో మోటార్ షోలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాన్సెప్ట్‌లను ప్రదర్శించారు.
బ్రెజిల్‌కి చెందిన ఫోర్డ్ విభాగం ఈకోస్పోర్ట్ మోడల్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన మూడు విభిన్న కాన్సెప్ట్ వాహనాలను బ్రెజిల్‌లో జరుగుతున్న 28వ అంతర్జాతీయ సావ్ పాలో మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది.
స్టోర్మ్, బ్యూటీ, బీస్ట్ అనే మూడు వెర్షన్లలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కస్టమైజ్ చేసి, ప్రదర్శనకు ఉంచారు. ఈ మూడు మోడళ్లకు సంబంధించిన మరింత సమాచారన్ని ఈ కథనంలో తెలుసుకోండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ స్టోర్మ్, బ్యూటీ, బీస్ట్ మోడళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ స్టోర్మ్
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ స్టోర్మ్ కాన్సెప్ట్‌ను కంపెనీ అందిస్తున్న ఎఫ్150 రాప్టర్ పికప్ ట్రక్ నుంచి స్ఫూర్తి పొంది, రగ్గడ్ ఆఫ్-రోడర్‌లా కనిపించేలా డిజైన్ చేశారు. బ్లూ స్టోర్మ్ ఎక్స్టీరియర్ పెయింట్‌తో డిజైన్ చేసిన ఈకోస్పోర్ట్ స్టోర్మ్ ఫ్రంట్ గ్రిల్‌ను పూర్తిగా రివైజ్ చేశారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ స్టోర్మ్
ఆకర్షనీయమైన బాడీ డెకాల్స్, సెకండరీ ఎయిర్ డ్యామ్, బ్లాక్ బంపర్ విత్ సిల్వర్ స్కిడ్ ప్లేట్, బ్లాక్ కలర్ బానెట్, బ్లాక్ వీల్ ఆర్చెస్, 15-ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ విత్ హై-ప్రొఫైల్ 215/75 ఆఫ్-రోడ్ టైర్స్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బ్యూటీ
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బ్యూటీని పేరుకు తగినట్లుగానే అందంగా డిజైన్ చేశారు. ఈ కారును మ్యాట్ మెటాలిక్ కాపర్ స్టార్‌డస్ట్ ఎక్స్టీరియర్ కలర్‌లో డిజైన్ చేశారు. ఫ్రంట్ ఎయిర్‌డ్యామ్ పక్కన E షేపులో అమర్చిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బ్యూటీ
విశిష్టమైన ఫ్రంట్ బంపర్, బ్లాక్ కలర్ రూఫ్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, లో-ప్రొఫైల్ టైర్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులతో పాటుగా నాలుగు ఇండివిడ్యువల్ ఆర్మ్‌చైర్ టైప్ సీట్స్, లెథర్ అప్‌హెలెస్ట్రీ, డివిడి స్క్రీన్స్, మల్టీమీడియా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్ వంటి ఇంటీరియర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బీస్ట్
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బీస్ట్ కాన్సెప్ట్ కారును పెరల్‌సెంట్ స్పీడ్ వైట్ కలర్‌లో పెయింట్ చేశారు. ఈ కారులో కూడా విశిష్టమైన ఫ్రంట్ బంపర్, గ్రిల్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, విశిష్టమైన డిజైన్‌తో కూడిన 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బీస్ట్
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బీస్ట్ ఎక్స్టీరియర్‌లో అనేక మార్పులు ఉన్నాయి. బ్లూ కలర్ ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, బానెట్‌పై బ్లాక్ కలర్ ఎయిర్ ఇన్-టేక్, బ్లాక్ కలర్ రూఫ్ రెయిల్స్, రూఫ్‌పై బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, బ్లాక్ కలర్ వీల్ ఆర్చెస్, ఎక్స్టీరియర్‌లో అక్కడక్కడా రెడ్ కలర్ లైన్స్ అండ్ బార్డర్స్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.


Click it and Unblock the Notifications








