ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ బేస్ వేరియంట్‌‌లో సేఫ్టీ ఫీచర్లు లేవు..

By Ravi

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. ఇటీవలే గోవాలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను మీడియా ప్రతినిధులు టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ప్రమాదానికి గురైన సంగతి తెలిసినదే. అయితే, ఈ కారులోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్ల వలన అందులోని డ్రైవర్, ప్యాసింజర్ ఇద్దరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఈకోస్పోర్ట్ సేఫ్టీ ఫీచర్స్ గురించి ఆహా ఓహో అంటు భారీ ఎత్తున ప్రచారం చేయటం జరిగింది.

అయితే, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బ్రోచర్‌ (క్రింది స్లైడ్‌లో చూడొచ్చు)ను బట్టి గమనిస్తే, ఇందులోని ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో (ఆంబీంటే)లో ఒక్కటంటే ఒక్క సేఫ్టీ ఫీచర్ కూడా లేదు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా 'ఎమర్జెన్సీ అసిస్ట్' ఓ అధునాతన సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేసిన ఫోర్డ్, తమ ఈకోస్పోర్ట్ బేస్ వేరియంట్‌లో ఎలాంటి సేఫ్టీ ఫీచర్లను అందించకపోవటం గమనార్హం.

ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్, ఓవర్ స్పీడ్ అలారమ్, ఐఎస్ఓఫిక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ఎమర్జెన్సీ బ్రేక్ హాజార్డ్ వార్నింగ్ వంటి ఫీచర్లలో ఏ ఒక్క ఫీచర్ కూడా ఫోర్డ్ ఆంబీంటే వేరియంట్‌లో లేదు. (ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మొత్తం నాలుగు వేరియంట్లలో (ఆంబీంటే, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం ఆప్షనల్) లభిస్తుంది).

సేఫ్టీ ఫీచర్ విషయంలో తాజాగా ఫోర్డ్ ఇండియాకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పెట్టిన ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్ మిడ్ వేరియంట్ (ట్రెండ్)లో కూడా లేకపోవటం మరింత విచారకరం. ఈ వేరియంట్‌లో కేవలం ఏబిఎస్ మరియు ఎమర్జెన్సీ బ్రేక్ హాజార్డ్ వార్నింగ్ సేఫ్టీ ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో (టైటానియం, టైటానియం ఆప్షనల్)లో మాత్రమే లభిస్తుంది.

ఈకోస్పోర్ట్ బేస్ వేరియంట్‌లో డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సాధారణ సేఫ్టీ ఫీచర్లు కూడా లేకపోవటం పెద్ద ఆశ్చర్యకర విషయం ఏమీ కాదు. ఎందుకంటే, భారతీయ రోడ్ సేఫ్టీ నిబంధనలు యూరోపియన్ చట్టాల మాదిరిగా కఠినతరమైనవి కాదు కాబట్టి తయారీ సంస్థలు ఈ లొసుగును ఆసరగా చేసుకొని క్యాష్ చేసుకుంటున్నాయి. మీరేమంటారు..?

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ బేస్ వేరియంట్‌‌లో సేఫ్టీ ఫీచర్లు లేవు

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ బేస్ వేరియంట్‌‌లో సేఫ్టీ ఫీచర్లు లేవు

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బ్రోచర్‌ (క్రింది స్లైడ్‌లో చూడొచ్చు)ను బట్టి గమనిస్తే, ఇందులోని ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో (ఆంబీంటే)లో ఒక్కటంటే ఒక్క సేఫ్టీ ఫీచర్ కూడా లేదు.

ఫోర్డ్ ఈకోస్పోర్డ్ గోవా యాక్సిడెంట్

ఇటీవలే గోవాలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను మీడియా ప్రతినిధులు టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ప్రమాదానికి గురైన సంగతి తెలిసినదే. అయితే, ఈ కారులోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్ల వలన అందులోని డ్రైవర్, ప్యాసింజర్ ఇద్దరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బ్రోచర్

ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్, ఓవర్ స్పీడ్ అలారమ్, ఐఎస్ఓఫిక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ఎమర్జెన్సీ బ్రేక్ హాజార్డ్ వార్నింగ్ వంటి ఫీచర్లలో ఏ ఒక్క ఫీచర్ కూడా ఫోర్డ్ ఆంబీంటే వేరియంట్‌లో లేదు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్స్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మొత్తం నాలుగు వేరియంట్లలో (ఆంబీంటే, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం ఆప్షనల్) లభిస్తుంది

ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్

సేఫ్టీ ఫీచర్ విషయంలో తాజాగా ఫోర్డ్ ఇండియాకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పెట్టిన ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్ మిడ్ వేరియంట్ (ట్రెండ్)లో కూడా లేకపోవటం మరింత విచారకరం. ఈ వేరియంట్‌లో కేవలం ఏబిఎస్ మరియు ఎమర్జెన్సీ బ్రేక్ హాజార్డ్ వార్నింగ్ సేఫ్టీ ఫీచర్లు మాత్రమే ఉన్నాయి.

టాప్ ఎండ్ వేరియంట్లలో ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్

ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో (టైటానియం, టైటానియం ఆప్షనల్)లో మాత్రమే లభిస్తుంది.

బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ లేని ఈకోస్పోర్ట్ బేస్ వేరియంట్

ఈకోస్పోర్ట్ బేస్ వేరియంట్‌లో డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సాధారణ సేఫ్టీ ఫీచర్లు కూడా లేకపోవటం పెద్ద ఆశ్చర్యకర విషయం ఏమీ కాదు. ఎందుకంటే, భారతీయ రోడ్ సేఫ్టీ నిబంధనలు యూరోపియన్ చట్టాల మాదిరిగా కఠినతరమైనవి కాదు కాబట్టి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 4, 2013, 11:47 [IST]
English summary
Ford Sync Emergency Assist will not be available for the first two variants - Ambiente and Trend. In fact, the base variant, Ambiente will hit the roads with absolutely no safety features and Trend only gets the most basic safety features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+