ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సేఫ్టీ రేటింగ్ ఎంత? ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ రిజల్ట్స్!

ఫోర్డ్ ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' కారులోని ప్యాసింజర్ల సేఫ్టీ విషయంలో ఎంత మేర బెస్ట్ అనేది తెలిసిపోయింది. యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఐదు నక్షత్రాలకు గాను నాలుగు నక్షత్రాలను (4 స్టార్స్) దక్కించుకుని సేఫ్టీ విషయంలో శభాష్ అనిపించుకుంది. ఇండియాలోని ఫోర్డ్ చెన్నై ప్లంట్‌లో తయారు చేసిన ఈకోస్పోర్ట్‌ను యూరప్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

ఈమేరకు యూరో ఎన్‌సిఏపి ఈకోస్పోర్ట్ క్రాష్ టెస్ట్ నిర్వహించి అందులోని ప్యాసింజ్ల సేఫ్టీని అంచనా వేసి, సదరు ఫలితాలను వెల్లడి చేసింది. అమెరికన్ వెర్షన్ ఈకోస్పోర్ట్ మాదిరిగానే ఇండియన్ వెర్షన్ ఈకోస్పోర్ట్ కూడా ఈ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్స్‌కు గాను 4 స్టార్స్ సొంతం చేసుకుంది. మరి మన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కారులో ప్రయాణికులు ఎంత వరకు సురక్షితంగా ఉంటారో తెలిపే ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ ఫలితాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

చివరి స్లైడ్‌లో క్రాష్ టెస్ట్ వీడియోను వీక్షించడం మర్చిపోకండి..!

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్

ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో మొత్తం ఐదు స్టార్లు ఉంటాయి. సాధారణంగా ఏ కారైనా ఈ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను తెచ్చుకుందంటే అది అన్ని విధాల సురక్షితమైన కారని, అందులో ప్రయాణికులకు పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని అర్థం. ఈ క్రాష్ టెస్ట్‌కు దాదాపుగా అన్ని భద్రతా ఫీచర్లు కలిగిన టాప్ ఎండ్ వేరియంట్లను మాత్రమే ఉపయోగిస్తారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్

క్రాష్ టెస్ట్ చేసే సమయంలో కారులో మనుషులకు బదులుగా డమ్మీలను ఉంచి, డమ్మీలకు కలిగే ప్రమాదాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేసి, సేఫ్టీ రేటింగ్‌ను ఇస్తుంది. ఇందులో తక్కువ రేటింగ్ వచ్చిన కార్లను భద్రత ఫీచర్ల పరంగా బలహీమైనవిగా పరిగణిస్తారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్

యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ ఫలితాల ప్రకారం, ప్రమాదం జరిగినప్పుడు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కారులో ప్రయాణించే ప్రయాణికుల శిరస్సు, మొండెం చక్కగా రక్షించబడుతాయని తేలింది. అయితే మోకాళ్ల రక్షణ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్లు గుర్తించారు. చైల్డ్ సేఫ్టీ విషయంలో కూడా ఇది మంచి రేటింగ్‌ను దక్కించుకుంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్

యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ ఫలితాలు ఇలా ఉన్నాయి:

* పెద్దవాళ్ల సేఫ్టీ: 93 శాతం

* చిన్న పిల్లల సేఫ్టీ: 77 శాతం

* పాదచారుల సేఫ్టీ: 59 శాతం

* సేఫ్టీ అసిస్ట్: 55 శాతం

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్

ఈ ఫలితాలను బట్టి చూస్తే, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కారులో పెద్దవాళ్లకు సేఫ్టీ చక్కగా ఉంటుంది, పిల్లల విషయంలో ఫర్వాలేదు. కానీ పాదచారులు, సేఫ్టీ అసిస్ట్‌ల విషయంలో మాత్రమే ఇది కాస్తంత తక్కువగా అనిపిస్తుంది. అందుకే ఈ క్రాష్ టెస్ట్‌లో దీనికి 4 స్టార్స్ మాత్రమే వచ్చాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్

సాధారణంగా, ఈ క్రాష్ టెస్టుకు ఉపయోగించే కారును ఆటోమేటిక్‌గా నడిచేలా చేసి ఒక నిర్ధిష్ట వేగం వద్ద బలమైన ఇనుప దిమ్మెకు గుద్దుకునేలా చేసి, ఆ తర్వాత కారులో జరిగే పరిణామాలను అంచనా వేస్తారు. ఇందులో ప్రయాణికులకు బదులుగా సున్నితమైన డమ్మీ బొమ్మలను ఉపయోగిస్తారు.

బొమ్మలకు తగిలే దెబ్బలను బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తారు. ఎంత మేర రక్షణ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్‌లు సరైన సమయంలో విచ్చుకున్నాయా లేదా, సేఫ్టీ సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత స్టార్ రేటింగ్‌తో సర్టిఫై చేయటం జరుగుతుంది. (క్రాష్ టెస్ట్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి).

యూరో ఎన్‌సిఏపి ఈకోస్పోర్ట్ క్రాష్ టెస్ట్‌తో పాటుగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈసిఎస్) సిస్టమ్‌‌ను టెస్ట్ చేసింది. యూరోపియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో ఈ ఫీచర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇండియన్ వెర్షన్ ఈకోస్పోర్ట్‌లో కేవలం టాప్-ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫీచర్ వలన కారు రోడ్డుపై స్కిడ్ కాకుండా, కంట్రోల్డ్‌గా ఉంటుంది. (ఆ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి).

More from DriveSpark

Article Published On: Thursday, November 28, 2013, 11:18 [IST]
English summary
Euro NCAP (New Car Assessment Program), the European organization that tests preventive safety features and crashworthiness of new vehicles has released its results for the new Ford EcoSport. The India built compact SUV has scored 4 stars out of 5.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+