రెండోసారి పెరిగిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ ధర

By Ravi

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు మరోసారి పెరిగాయి. గడచిన సెప్టెంబర్ నెలలో రూపాయి బలహీనత, పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక వడ్డీ రేట్లు వెరసి పెరుగుతున్న ఉత్పాదక వ్యయం తదితర అంశాల నేపథ్యంలో, ఫోర్డ్ ఇండియా తమ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను వేరియంట్‌ను బట్టి రూ.30,000 నుంచి రూ.50,000 రేంజ్‌లో పెంచిన సంగతి తెలిసినదే.

కాగా.. తాజాగా జనవరి నెలలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధరలను కంపెనీ మరోసారి సవరించింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధరల పెంపు క్రింది విధంగా ఉంది:
* బేస్ పెట్రోల్ వేరియంట్ ఈకోస్పోర్ట్ ధర విడుదల ధర కన్నా రూ.60,000 అధికం.
* ఈకోబూస్ట్ ఇంజన్ కలిగిన బేస్ వేరియంట్ ధర విడుదల ధర కన్నా రూ.61,000 అధికం.
* ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర విడుదల ధర కన్నా రూ.59,000 అధికం.
* బేస్ డీజిల్ వేరియంట్ ధర విడుదల ధర కన్నా రూ.69,000 అధికం.

వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు వేర్వేరుగా ఉంటుంది. ప్రస్తుతం టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. విడుదల సమయంలోని ధరతో పోల్చుకుంటే ఇది రూ.75,000 అధికం. మొత్తమ్మీద చూసుకుంటే, విడుదల సమయంలో ధరలకి తాజా ధరలకి మధ్య వ్యత్యాసం రూ.60,000 నుంచి రూ.75,000 వరకు ఉంటోంది (వేరియంట్‌ను బట్టి).

Ford EcoSport Price Hiked For The Second Time

More from DriveSpark

Article Published On: Saturday, January 11, 2014, 23:37 [IST]
English summary
The disastrous launch of the Ford EcoSport continues as the American manufacturer has hiked prices of the model yet again. Ford EcoSport was launched in June last year at an extremely competitive starting price, following plenty of hype and advertising that lasted months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+