రూ.50,000 మేర పెరిగిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రియులకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. రూపాయి బలహీనత, పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక వడ్డీ రేట్లు వెరసి పెరుగుతున్న ఉత్పాదక వ్యయంతో ఫోర్డ్ తమ ఉత్పత్తుల ధరలను సెప్టెంబర్ 5, 2013వ తేదీ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ పెంపులో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మోడల్ కూడా ఉంది.
తాజా పెంపుతో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు వేరియంట్‌ను బట్టి రూ.30,000 నుంచి రూ.50,000 రేంజ్‌లో పెరిగాయి. దీంతో కొత్తగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు కొందరు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డీలర్లు అధిక డిమాండ్ కారణంగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో కొన్ని వేరియంట్ల బుకింగ్‌లను నిలిపివేస్తున్నారు.
తాజా పెంపు తర్వాత ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కొత్త ధరలను, పాత ధరలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

1.5 ఎమ్‌టి ఆంబీంటే - పెట్రోల్
పాత ధర - రూ.5.59 లక్షలు
కొత్త ధర - రూ.5.85 లక్షలు

1.5 ఎమ్‌టి ట్రెండ్ - పెట్రోల్
పాత ధర - రూ.6.49 లక్షలు
కొత్త ధర - రూ.6.80 లక్షలు

1.5 ఎమ్‌టి టైటానియం - పెట్రోల్
పాత ధర - రూ.7.51 లక్షలు
కొత్త ధర - రూ.7.91 లక్షలు

1.5 ఏటి టైటానియం - పెట్రోల్
పాత ధర - రూ.8.45 లక్షలు
కొత్త ధర - రూ.8.70 లక్షలు

1.0 ఎమ్‌టి టైటానియం - పెట్రోల్
పాత ధర - రూ.7.89 లక్షలు
కొత్త ధర - రూ.8.31 లక్షలు

1.0 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - పెట్రోల్
పాత ధర - రూ.8.29 లక్షలు
కొత్త ధర - రూ.8.69 లక్షలు

1.5 ఎమ్‌టి ఆంబీంటే - డీజిల్
పాత ధర - రూ.6.69 లక్షలు
కొత్త ధర - రూ.7.04 లక్షలు

1.5 ఎమ్‌టి ట్రెండ్ - డీజిల్
పాత ధర - రూ.7.61 లక్షలు
కొత్త ధర - రూ.7.91 లక్షలు

1.5 ఎమ్‌టి టైటానియం - డీజిల్
పాత ధర - రూ.8.62 లక్షలు
కొత్త ధర - రూ.9.02 లక్షలు

1.5 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - డీజిల్
పాత ధర - రూ.8.99 లక్షలు
కొత్త ధర - రూ.9.04 లక్షలు


Click it and Unblock the Notifications








