ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎయిర్ కండిషన్ 'సూపర్ కూల్'..

By Ravi

బయట ఎండలు మండిపోతున్నాయి. మండు వేసవిలో ప్రయాణం అంటేనే హడలెత్తిపోయే పరిస్థితి. మనం వెళ్లే ప్రతిచోటుకు ఎయిర్ కండిషన్‌ను తీసుకువెళ్లటం మనకు సాధ్యం కాదు కానీ, అలా సాధ్యమయ్యేటట్లుంటే మన ప్రయాణం మరింత చల్లగా, హాయిగా సాగిపోతుంది. ఎయిర్ కండిషన్‌ను మనతో తీసుకువెళ్లలేకపోవచ్చు, ఏసి ఉన్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కారును మనతో తీసుకు వెళ్లవచ్చు.

అవును.. ఈ సమ్మర్‌లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో ప్రయాణం చల్లగా అనిపిస్తుంది. సన్‌ఫిల్మ్ రూల్ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని కార్ల అద్దాలకు ఫిల్ములు తొలగించడంతో కారులో ఎయిర్ కండిషన్ ఆన్ చేసినా అది పెద్దగా ప్రయోజనాన్ని చూపించడం లేదని చాలా మంది కార్ యజమానులు చెబుతుంటారు. కానీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లోని అధునా ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్ మాత్రం చాలా విశిష్టంగా ఉంటుంది.


సాధారణంగా ఓ కారును ఎటువంటి నీడ లేని చోట ఎండలో పార్క్ చేస్తే, కారులో ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లోని అధునాతన క్లైమేట్ కంట్రోల్ సాయంతో కేవలం పది నిమిషాలు ఎయిర్ కండిషన్‌ను ఆన్ చేస్తే ఈ 70 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్తా 30 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోతుంది.

ఇది కూడా చదవండి: ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఫోర్డ్ సౌత్ అమెరికా క్లైమేట్ కంట్రోల్ సూపర్‌వైజర్ పౌల్ మెర్లో దీని గురించి వివరిస్తూ.. మాగ్జిమం ఫ్యాన్ అండ్ ఎయిర్ వెలాసిటీతో అత్యంత వేయంగా వాహనంలో ఉష్ణోగ్రతలను తగ్గించేలా ఈ సిస్టమ్‌ను డిజైన్ చేయబడిందని, ఈ పెర్ఫార్మెన్స్ వలన బ్లోయెర్ ఫ్యాన్ స్పీడ్ (మరియు ఎయిర్ ఫ్లో)ను త్వరగా తగ్గించుకునేందుకు తద్వారా నిశ్శబ్ధ క్యాబిన్‌లో ప్యాసింజర్‌లు సౌకర్యంగా ఉండేకు సహకరిస్తుందని ఆయన చెప్పారు.

Ford EcoSport

ఫోర్డ్ తమ అధునాతన ఎయిర్ కండిషన్ సిస్టమ్‌లో వేరియబల్ కంప్రెషర్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ టెక్నాలజీ వలన క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ తక్కువ పవర్‌ను ఉపయోగించుకుంటుంది, ఫలితంగా మైలేజ్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపదు. దీని వలన ప్యాసింజర్లు హాట్ సమ్మర్‌లో కూల్‌గా ప్రయాణించడమే కాకుండా, మైలేజ్ తగ్గుతుందన్న టెన్షన్‌ను కూడా మర్చిపోవచ్చు.

ఫోర్డ్ తమ ఈకోస్పోర్ట్‌లోని వేరియబల్ కంప్రెసర్ కోసం ఓ ఆయిల్ సపరేటర్‌ను కేటాయించింది, ఇది ఏసిని ఉపయోగించినప్పుడు దాని సామర్థ్యాన్ని పెంచేందుకు సహకరిస్తుంది. సాంప్రదాయ ఎయిర్ కండిషన్‌లతో పోల్చుకుంటే ఈ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ విభిన్నంగా ఉంటుంది. ఫోర్డ్ ఇంజనీర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ సిస్టమ్‌‌ను అభివద్ధి చేశారు. మరి ఈకోస్పోర్ట్ ఏసి పనితీరు ఎలా ఉంది?

More from DriveSpark

Article Published On: Thursday, May 29, 2014, 12:09 [IST]
English summary
The Ford EcoSport has an air conditioner with climate control and can come very handy during the hot Indian summer. It has been noted that a car parked under no shade can reach to temperatures as high as 70 degree Celsius. With the help of Ford's advanced climate control it only takes ten minutes to bring the temperature back to a much bearable 30 degree Celsius.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+