ఈకోస్పోర్ట్‌కు పెరిగిన వెయిటింగ్ పీరియడ్, తగ్గిన ధర

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' దేశీయ విపణిలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. తక్కువ ఉత్పత్తి ఎక్కువ డిమాండ్ కారణంగా ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరిగిపోతుంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను కంపెనీ తమ చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తైన ఈకోస్పోర్ట్‌ను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో రెండు షిఫ్టులు నడుస్తున్నాయి. అయితే, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇందులో మూడవ షిఫ్టును కూడా ప్రారంభించేందుకు ఫోర్డ్ ఇండియా సన్నాహాలు చేస్తుంది.


ప్రతి షిఫ్టులో 350 ఈకోస్పోర్ట్ వాహనాల చొప్పున రెండు షిఫ్టులకు గాను 700 ఉత్పత్తి అవుతాయి. కాగా.. మూడవ షిఫ్టును కూడా ప్రారంభించినట్లయితే ఇందుకు అదనంగా మరో 350 యూనిట్లు వచ్చి చేరుతాయి. ఇదే గనుక జరిగితే ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ కాస్తయినా తగ్గే ఆస్కారం ఉంది.

ఇదిలా ఉండగా.. ఇటీవలే ప్రవేశపెట్టిన మధ్యంత బడ్జెట్‌లో కాంపాక్ట్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 తగ్గించిన నేపథ్యంలో, ఫోర్డ్ ఇండియా కూడా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరను తగ్గించాలని నిర్ణయించింది. వాస్తవానికి బడ్జెట్ ప్రకారం ఈ తగ్గింపు రూ.30,000 ఉంటుంది. అయితే, ఫోర్డ్ తమ ఈకోస్పోర్ట్ ధరను ఎంత మేర తగ్గిస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Frod EcoSport Rear

మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ తగ్గింపు జూన్ 20, 2014 వరకు అమల్లో ఉంటుంది. అప్పటి వరకు కార్ల ధరలు కూడా తక్కువగానే ఉండే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 19, 2014, 10:24 [IST]
English summary
Ford EcoSport has been in demand ever since its launch. The compact SUV has dominated the segment significantly. However, extensive booking has delayed the car, due to low supply. On the other hand Ford India hasn't announced any cut in price after the Interim Budget of 2014-2015. Most of the automobile manufacturers have announced reduction in prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+