మలేషియాలో ఫోర్డ్ ఫియస్టా ఈకోబూస్ట్ 1.0 విడుదల

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ త్వరలో భారత మార్కెట్లో తమ అధునాత ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతానికి ఫోర్డ్ కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే ఫియస్టా సెడాన్‌ను విడుదల చేయనుంది. అయితే, భవిష్యత్తులో మన మార్కెట్లో ఈకోబూస్ట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ (ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో ఉపయోగిస్తున్నది)తో కూడిన ఫియస్టా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా మేము ప్రచురించడం జరిగింది. ఇప్పుడు ఆ వాదనకు మరింత బలం చేకూరుతోంది.

ఎందుకంటే, ఫోర్డ్ మలేషియా మార్కెట్లో ఈకోబూస్ట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ 2014 ఫియస్టా సెడాన్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఇదే వేరియంట్ త్వరలోనే ఇండియాకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలేషియా కరెన్సీలో ఈ వేరియంట్ ధర 99,588 ఆర్ఎమ్‌లుగా ఉంది (మనదేశ కరెన్సీలో సుమారు రూ.18,46,320). ఈ వేరియంట్ ఆర్టిక్ వైట్, ప్యాంథర్ రెడ్ మరియు ట్రూ బ్లూ అనే మూడు ఆకర్షనీయమైన రంగులలో అక్కడి మార్కెట్లో లభ్యం కానుంది.

Ford Fiesta EcoBoost

అనేక అవార్డులు దక్కించుకున్న ఫోర్డ్ 1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్, పరిమాణంలో చిన్నదైనప్పటికీ, సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్లతో పోల్చుకుంటే మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను మరియు మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 125 పిఎస్‌ల శక్తిని, 1400-4500 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ పవర్‌షిఫ్ట్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

అయితే, ఇండియన్ వెర్షన్ విషయానికి వచ్చే సరికి పవర్‌షిఫ్ట్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌కు బదులుగా 5-స్పీడ్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది. మలేషియన్ వెర్షన్ ఫియస్టా కేవలం ఈకోబూస్ట్ ఇంజన్‌తోనే కాకుండా ఓ స్పెషల్ బాడీ కిట్‌తో కూడా లభిస్తోంది. ఈ బాడీ కిట్ ఓవరాల్‌కు ఫియస్టాకు మరింత స్పోర్టీ అండ్ ప్రీమియం లుక్‌నిస్తుంది. కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 18, 2014, 10:44 [IST]
English summary
The Ford Fiesta 1.0 EcoBoost has now reached Malaysian shores. The new car is only available in one hatchback variant and is priced at RM 99,588 on the road minus insurance (INR 1,846,320) and is available in Artic White, Panther Red and True White.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+