ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ; జూన్‌లో లాంచ్

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ పోర్డ్, భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. తాజాగా గతంలో ఫోర్డ్ ఆవిష్కరించిన కాన్సెప్ట్ సెడాన్‌కు ప్రొడక్షన్ వెర్షన్‌ను గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఆవిష్కరించింది.

ఈ సరికొత్త ఫోర్డ్ కాంపాక్ట్ సెడాన్‌ను 'ఫిగో ఆస్పైర్' (Figo Aspire) అని పిలువనున్నారు. ఈ కారును ఫోర్డ్ గుజరాత్‌లోని సనంద్ వద్ద కొత్తగా ప్రారంభించిన ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనున్నారు. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ రానున్న జూన్ నెల నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

Ford Figo Aspire

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ డివి5 ఇంజన్‌తోను లభ్యం కానుంది. ఆసక్తికరమైన విషయం ఏటంటే.. ఇందులో ఓ పవర్‌ఫుల్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్‌కూడా అందుబాటులో ఉంది. ఈ పవర్‌ఫుల్ పెట్రోల్ వెర్షన్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ మాదిరిగానే ఇందులో ఓ నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఫిగో కూడా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ఈ రెండు మోడళ్లను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన గుజరాత్ ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో సాలీనా 2.40 లక్షల వాహనాలను, 2.70 లక్షల ఇంజన్లను తయారు చేసే సామర్థ్యం ఉంది.

Ford Figo Aspire Revealed

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా జెస్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
American based automobile giant, Ford inaugurated its new facility in Sanand, Gujarat on 26th March, 2015. They also took the opportunity to showcase their new vehicle for India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X