ఫియస్టా సెడాన్ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫియస్టా సెడాన్ ధరలను పెంచింది. గడచిన డిసెంబర్ నెలకూ ప్రభుత్వం పొడగించిన ఎక్సైజ్ సుంకపు రాయితీలను ఎత్తివేడంతో పాటుగా కంపెనీ ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపు తర్వాత ఫోర్డ్ ఫియస్టా ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి:

  • ఫోర్డ్ ఫియస్టా యాంబీంట్ - రూ.8.50 లక్షలు
  • ఫోర్డ్ ఫియస్టా ట్రెండ్ - రూ.9.40 లక్షలు
  • ఫోర్డ్ ఫియస్టా టైటానియం - రూ.10.19 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Ford India Hikes Prices Of Fiesta Sedan For 2015

ప్రస్తుతం భారత మార్కెట్లో ఫోర్డ్ ఫియస్టా ఒకే ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతోంది. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 92 బిహెచ్‌పిల శక్తిని, 204 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బక్స్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

ఫోర్డ్ ఫియస్టాలో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఇంజన్ ఇమ్మొబిలైజర్, డోర్ రీఇన్‌ఫోర్స్‌మెంట్స్, క్రంపల్ జోన్స్, ఎనర్జీ అబ్జార్వింగ్ బంపర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా సిటీ, మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 27, 2015, 11:02 [IST]
English summary
Ford India too has silently increased the prices of its Fiesta sedan. This is due to excise benefit not continuing for 2015. Last year the American manufacturers sedan was priced between INR 7,69,000 to INR 9,29,000 ex-showroom, Delhi. The new prices for 2015 Ford Fiesta are as Follows:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+