లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్‌ను విడుదల చేసిన ఫోర్డ్ ఇండియా
ఫోర్డ్ ఇండియా అందిస్తున్న క్లాసిక్ సెడాన్‌లో మరిన్ని అధనపు ఫీచర్లు జోడించిన ఓ లిమిటెడ్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కేవలం సిఎల్ఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఫాగ్ ల్యాంప్స్, 14-ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్, వెను నెంబర్ ప్లేట్‌కు క్రోమ్ గార్నిష్, రియర్ స్పాయిలర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.
అంతేకాకుండా, ప్రీమియం సీట్ కవర్స్, రీడింగ్ ల్యాంప్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు కూడా ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోర్డ్ క్లాసిక్ సెడాన్‌లో లభ్యం కానున్నాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఫోర్డ్ క్లాసిక్ లిమిటెడ్ ఎడిషన్ (పెట్రోల్): రూ.7.74 లక్షలు
- ఫోర్డ్ క్లాసిక్ లిమిటెడ్ ఎడిషన్ (డీజిల్): రూ.6.72 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ గరిష్టంగా లీటర్ డీజిల్‌కు 32.38 కి.మీ. మైలేజీనిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం). ఇందులో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ లీటరు పెట్రోల్‌కు 21.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో 1.6 లీటర్ డ్యూరాటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 101 పిఎస్‌ల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








