రిఫ్రెష్డ్ ఫోర్డ్ ఫిగో విడుదల; ప్రారంభ ధర రూ.3.87 లక్షలు
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న చిన్న కారు 'ఫోర్డ్ ఫిగో'లో కంపెనీ ఇప్పుడు ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ప్రస్తుత పండుగ సీజన్‌ను పురస్కరించుకొని, ఈ కొత్త వెర్షన్‌ను ఫిగోను ఫోర్డ్ ఇండియా ప్రవేశపెట్టింది.
సాధారణంగా పండుగ సీజన్‌లో కొనుగోళ్ల సెంటిమెంట్ బలంగా ఉంటుంది, ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఫోర్డ్ తమ పాపులర్ ఫిగో కారులో ఫ్రెష్ ఎక్స్టీరియర్ స్టయిలింగ్, సరికొత్త ఇంటీరియర్ థీమ్‌తో కూడిన రిఫ్రెష్డ్ ఫిగోను విడుదల చేసింది.

ఈ ఫ్రెష్ లుక్ ఫోర్డ్ ఫిగో స్మోకీ స్టీల్త్ ఫినిష్ ఎక్స్టీరియర్ స్టయిలింగ్ (14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్ బెజెల్స్, రియర్ బంపర్ వలాన్స్)ను కలిగి ఉంటుంది. సన్నగా ఉండే క్రోమ్ సిగ్నేచర్ ఫెండర్ బ్యాడ్జ్, ఎలక్ట్రిక్ మిర్రర్స్ విత్ టర్న్ ఇండికేటర్స్‌తో ఇది మరింత ప్రీమియం లుక్‍ని కలిగి ఉంటుంది.
ఇందులో కొత్తగా కైనెటిక్ బ్లూ టైటానియం అనే వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ వేరియంట్ సైబర్ బ్లూ ఎక్స్టీరియర్ థీమ్‌తో లభిస్తుంది. ఈ ఎక్స్టీరియర్ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా ఇంటీరియర్స్‌ను కూడా డ్యూయెల్ టోన్‌తో డిజైన్ చేశారు.
రిఫ్రెష్డ్ వెర్షన్ ఫోర్డ్ ఫిగోలో ఈ కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. పెట్రోల్ వెర్షన్ కొత్త ఫిగో ప్రారంభ ధర రూ.3.87 లక్షలు గాను మరియు డీజిల్ వెర్షన్ ఫిగో ప్రారంభ ధర రూ.4.83 లక్షలు గాను (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

ఈ కొత్త 2014 ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ కైనకెటిక్ బ్లూ, మార్స్ రెడ్, డైమండ్ వైట్, మూన్‌డస్ట్ సిల్వర్, చిల్ మెటాలిక్, పాంథర్ బ్లాక్, స్మోక్ గ్రే, పాప్రికా రెడ్ అనే ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఇది రెండేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ (ఏది ముందుగా ముగిస్తే అది)తో లభిస్తుంది. ఫోర్డ్ తమ కస్టమర్ల కోసం కేవలం రూ.2,199 ప్రారంభ ధరకే హ్యాపీ పాకెట్ సర్వీస్ పేరిట సమగ్ర సర్వీస్ ప్యాకేజ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ సర్వీస్ ప్యాకేజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో ఫోర్డ్ ఇండియా డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








